Site icon HashtagU Telugu

RGV : సిండికేట్ లో వెంకీ..నిజమేనా..?

Venky Rgv

Venky Rgv

‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam )అంటూ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి వెంకటేష్ (Venkatesh) బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. వెంకీకి చాల కాలం తర్వాత హిట్ కొట్టడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అభిమానులను ఓ వార్త కలవరపాటుకు గురి చేస్తుంది.

Gold Price Today : రికార్డు స్థాయిలో కొనసాగుతున్న ధరలు..!

రామ్ గోపాల్ వర్మ (RGV) తెరకెక్కించబోయే ‘సిండికేట్’ మూవీ లో వెంకీ నటిస్తున్నాడనే వార్త బయటకు వచ్చినప్పటి నుండి అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. రామ్ గోపాల్ వర్మ (RGV) ఒకప్పుడు ఈయనంటే చిత్రసీమకు అభిమానులకు , సినీ లవర్స్ కు ఎంతో అభిమానం ఉండేది. ఈయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేసిన వారు ఇప్పుడు టాప్ డైరెక్టర్ గా రాణిస్తున్నారు. అంతే ఎందుకు వర్మ నుండి సినిమా అంటే అగ్ర దర్శకుల నుండి సినీ లవర్స్ వరకు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలసిందే అని ఫిక్స్ అయ్యేవారు. అలాంటి మోస్ట్ పాపులర్ డైరెక్టర్..ఇప్పుడు చెత్త డైరెక్టర్ గా మారిపోయాడు. వివాదాలకు కేరాఫ్ గా మారిపోయి , అర్ధం పర్థం లేని సినిమాలు చేసి తన బ్రాండ్ ను మొత్తం పోగొట్టుకున్నాడు. ఒకప్పుడు వర్మ తో సినిమాలు చేయాలనీ పోటీ పడే నిర్మాతలు..ఇప్పుడు వర్మ తో సినిమా చేస్తే కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రావనే మాటకు వచ్చేసారు. ఆ రేంజ్ లో వర్మ దిగజారిపోయాడు. ఇప్పుడు తన తప్పులు తెలుసుకొని మళ్లీ తన సత్తా ఏంటో చూపిస్తా అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

Dr. Nageshwar Reddy : మూడు పద్మ అవార్డులు పొందిన తొలి భారతీయ వైద్యుడు నాగేశ్వర్ రెడ్డి

ఇక నుంచి తన గౌరవాన్ని పెంచే సినిమాలే తీస్తానన్న వర్మ ‘సిండికేట్’ అనే మూవీని తీయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇందులో మెయిన్ లీడ్ గా విక్టరీ వెంకటేశ్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్ లాంటి బిగ్ స్టార్స్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అభిమానులు మాత్రం వర్మ తో సినిమా చేయొద్దంటూ కోరుకుంటున్నారు.