RGV : రష్మిక తో వర్మ రొమాన్స్..అసలు విషయం ఏంటి అంటే..!!

వర్మ (RGV)…ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఈయన సినిమాల గురించి మాట్లాడుకునేవారు..కానీ ఇప్పుడు ఈయన వివాదాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏపని చేసిన అందులో పబ్లిసిటీ ఉండేలా చూసుకునే వర్మ..గత కొంతకాలంగా వివాదాస్పద చిత్రాలతో వార్తల్లో నిలుస్తున్నారు. కేవలం సినిమాలే కాదు బయట చేసే పనులు , కామెంట్స్ సైతం ఈయన్ను వివాదాల్లోకి నెట్టిస్తుంటాయి. ప్రస్తుతం వ్యూహం అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జగన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. […]

Published By: HashtagU Telugu Desk
Rgv Rashmika

Rgv Rashmika

వర్మ (RGV)…ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఈయన సినిమాల గురించి మాట్లాడుకునేవారు..కానీ ఇప్పుడు ఈయన వివాదాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏపని చేసిన అందులో పబ్లిసిటీ ఉండేలా చూసుకునే వర్మ..గత కొంతకాలంగా వివాదాస్పద చిత్రాలతో వార్తల్లో నిలుస్తున్నారు. కేవలం సినిమాలే కాదు బయట చేసే పనులు , కామెంట్స్ సైతం ఈయన్ను వివాదాల్లోకి నెట్టిస్తుంటాయి. ప్రస్తుతం వ్యూహం అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జగన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె సోషల్ మీడియా లో ఎప్పుడు పబ్ ల్లో ఎంజాయ్ చేస్తూ..యాంకర్ల తో రొమాంటిక్ గా ఉంటూ..ఆ పిక్స్ ను షేర్ చేస్తూ ఉండే వర్మ..తాజాగా వ్యూహం సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ కావడం తో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రష్మిక తో క్లోజ్ గా ఉన్న పిక్ పోస్ట్ చేసి సంచలనం రేపారు. ఇప్పటివరకు వర్మ తో రష్మిక కలిసిన సందర్భాలే లేవు కదా అలాంటిది ఇంత క్లోజ్ గా ఎప్పుడు ఉన్నారని ఈ పిక్ చూసిన వారంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే వాస్తవానికి ఆ పిక్ లోఉంది రష్మిక కాదు. అచ్చం రష్మిక లాగానే ఉండే మరో అమ్మాయి. మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు..ఈ అమ్మాయి కూడా అలాంటిదే. తప్ప నిజంగా రష్మిక కాదు.

ఈ మధ్య రష్మిక ఫేక్ వీడియోస్ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఓ డీప్ ఫేక్ వీడియో ఎంత వైరల్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వర్మ తో ఉన్న పిక్ కూడా అలాగే వైరల్ అవుతుంది. ఏది ఏమైనప్పటికి ఇలాంటి సృష్టించడం లో వర్మ దిట్ట అని మరోసారి నిరూపించుకున్నాడు.

Read Also : Valentines Day : ‘వాలెంటైన్స్ డే’ రోజు ఆ నాలుగు రాశులవారికి లక్కీ ఛాన్స్

  Last Updated: 09 Feb 2024, 11:54 AM IST