Site icon HashtagU Telugu

Bhola Shankar : భజన పొగడ్తలకి చిరంజీవి అలవాటు పడ్డాడంటూ వర్మ సెటైర్లు..

RGV satire on chiranjeevi over bholaa shankar

RGV satire on chiranjeevi over bholaa shankar

రామ్ గోపాల్ వర్మ మరోసారి చిరంజీవి ఫై రెచ్చిపోయారు. రీసెంట్ గా భోళా శంకర్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రతి ఒక్కరు మెగాస్టార్ ను ఆకాశానికి ఎత్తేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైపర్ ఆది స్పీచ్ ప్రతి మెగా అభిమానిని ఎంతగానో ఆకట్టుకుంది. సోషల్ మీడియా లో అయితే హైపర్ ఆది స్పీచ్ తెగ వైరల్ అయ్యింది. ఈ స్పీచ్ ను ప్రతి ఒక్కరు చూసారు. వారిలో వర్మ కూడా ఉన్నారు. ఇప్పుడు భోళా శంకర్ (Bhola Shankar) ఫలితాన్ని ఉద్దేశించి వర్మ (RGV) వెటకారంగా ట్వీట్ చేసారు.

చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మెహర్ బాగా నిరాశ పరిచాడని, వాల్తేర్ వీరయ్య తర్వాత మరో హిట్ పడుతుందని అనుకున్నామని , కానీ సినిమా ఆ రేంజ్ లో లేదని ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలో వర్మ సినిమా ఫలితాన్ని ఉద్దేశించి ట్విట్టర్ లో ట్వీట్స్ చేసారు.

‘జబర్, హైపర్ (Hyper Aadi) లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి, రియాల్టీకి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది’ అని ట్వీట్ చేసారు. మరో ట్వీట్ లో ‘పొగడ్తలతో ముంచే వాళ్ల బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్లు ఉండరు. రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు. వాళ్ల పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే’ అంటూ చిరంజీవికి సలహా ఇచ్చారు. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే సినిమా దొబ్బిందని ఫ్యాన్స్ బాధలో ఉంటె..వర్మ వారిని మరింత రెచ్చగొట్టేలా ట్వీట్స్ చేస్తుండడం తట్టుకోలేకపోతున్నారు.

Read Also : Bhola Shankar Review : భోళా శంకర్.. బాబోయ్..!