Site icon HashtagU Telugu

RGV Saree : వర్మ ‘శారీ’ ఎలా ఉందో తెలుసా..?

Saree Talk

Saree Talk

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సమర్పణలో వచ్చిన ‘శారీ’ (Saree ) సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గిరి కృష్ణ కమల్ (Giri Krishna Kamal) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆరాధ్య దేవి, సత్య యాదు కీలక పాత్రలు పోషించారు. సినిమాకు ముందు ఆర్జీవి తరహాలో హాట్ ఫోటో షూట్లతో విపరీతంగా ప్రమోషన్స్ చేశారు. మొదట్లో సినిమా ఓ రొమాంటిక్ థ్రిల్లర్ అనిపించినా, థియేటర్‌లో కూర్చుని చూసేంత వరకూ ప్రేక్షకులను ఆశించాల్సినంతగా ఆకట్టుకోలేకపోయింది.

Nominated Posts: ఏపీలో 38 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన‌.. జ‌న‌సేన‌కు కేటాయించినవి ఇవే

కథ విషయానికి వస్తే.. సోషల్ మీడియా ద్వారా జీవితంలో మోసాలు ఎలా జరుగుతాయనే అంశాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఒంటరిగా జీవించే ఆరాధ్య దేవి జీవితంలోకి కిట్టు ప్రవేశించి, ఆమెను స్టాక్ చేయడం, బెదిరించడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. అయితే, కథ ఎంతగానో ఆసక్తికరంగా మొదలైనా, మద్యలో కథనాల బలహీనతలు, ఆర్జీవి మార్క్ రొమాన్స్ పుష్కలంగా ఉండడం ప్రేక్షకుల్లో అసహనానికి దారి తీసింది. నిజానికి దర్శకుడు గిరి కృష్ణ కమల్ అయినా, ఈ సినిమా మొత్తం వర్మ స్టైల్‌లో సాగుతుండటంతో ఆడియన్స్‌కు ఇదీ వర్మ సినిమా అనే భావన కలగడం సహజం.

ఆర్జీవి సినిమాలంటే ప్రత్యేకమైన కెమెరా యాంగిల్స్, మంచి సౌండ్ డిజైన్ ఉండటం సహజం. కానీ ‘శారీ’ లో ఇవన్నీ మిస్సయ్యాయి. టెక్నికల్ గా సినిమా తక్కువ ప్రమాణాల్లో కనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా సాధారణంగా ఉన్నాయి. కథకు అవసరమైన గాఢత, టెన్షన్ కనపడకపోవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మసకబారింది. ఈ వేసవిలో మంచి కథతో వస్తుందని ఆశించిన వారు, చివరకు నిరాశ చెందకుండా ఉండలేరు. మొత్తంగా ‘శారీ’ వర్మ ఫ్యాన్స్‌కే కాదు, సాధారణ ఆడియన్స్‌కి కూడా నిరుత్సాహం కలిగించే మూవీ.