Money movie : చిరంజీవి మూవీకి పోటీగా ‘మనీ’ విడుదల.. వర్మ చెప్పిన లాజిక్ ఏంటో తెలుసా?

మనీ సినిమాని మెకానిక్‌ అల్లుడు రిలీజ్ అయి హిట్ అయిన రెండు వారలు లోపే రిలీజ్ చేయడంతో అందరూ వర్మకి ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఎక్కువ అయ్యిందని కామెంట్స్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
RGV Released Money Movie against Chiranjeevi Mechanic Alludu and get success

RGV Released Money Movie against Chiranjeevi Mechanic Alludu and get success

రామ్ గోపాల్ వర్మ(RGV) గురించి టాలీవుడ్(Tollywood) ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన లాజిక్స్ అండ్ మాటలతో తనకి నచ్చింది చేసుకుంటూ ఎవరు మాట వినకుండా ముందుకు వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే ఆర్జీవీ నిర్మాణంలో తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్‌ ‘మనీ’(Money) విషయంలో వర్మ చెప్పిన ఒక లాజిక్ హీరో జేడీ చక్రవర్తికి దిమ్మతిరిగేలా చేసిందట. 1993లో జేడీ చక్రవర్తి, బ్రహ్మానందం, పరేశ్‌ రావల్‌, చిన్నా, జయసుధ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మనీ సినిమాని శివ నాగేశ్వరరావు డైరెక్ట్ చేశాడు. ఇక ఈ మూవీని చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ‘మెకానిక్‌ అల్లుడు’కు పోటీగా రిలీజ్ చేసి హిట్టు అందుకున్నారు.

ఇప్పుడు సూపర్ హిట్ అయిన సినిమా కూడా రెండు వారలు కంటే ఎక్కువ థియేటర్స్ ఆడడం లేదు. కానీ ఒక్కప్పుడు అలా కాదు. ఒక మూవీ హిట్ అయ్యిందంటే థియేటర్స్ లో 50, 100 రోజులు ఆడేవి. దీంతో ఆ మూవీ రిలీజ్ అయిన మూడు నాలుగు వారలు వరకు మరో సినిమాకి థియేటర్లు దొరకడం కష్టం అయ్యేది. అలాంటి రోజుల్లో వర్మ.. మనీ సినిమాని మెకానిక్‌ అల్లుడు రిలీజ్ అయి హిట్ అయిన రెండు వారలు లోపే రిలీజ్ చేయడంతో అందరూ వర్మకి ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఎక్కువ అయ్యిందని కామెంట్స్ చేశారు. ఇక ఈ విషయం గురించి జేడీ చక్రవర్తి కూడా ఆర్జీవీ దగ్గరకి వెళ్లి.. “చిరంజీవిగారి సినిమాతో మనకి పోటీ అవసరమా?” అంటూ అడిగాడట.

దానికి ఆర్జీవీ బదులిస్తూ ఒక లాజిక్ చెప్పాడట. “ఒకవేళ మన సినిమా ప్లాప్ అయ్యింది అనుకో చిరంజీవి సినిమాతో పోటీకి వెళ్తే ఆడుతుందా? అని అనుకుంటారు తప్ప కథ గురించి, నటీనటులు నటన గురించి కామెంట్స్ చేయరు. అదే హిట్ అయ్యింది అనుకో.. చిరంజీవి మూవీ ఉన్న గాని బాగా ఆడింది అంటూ గొప్పగా చెబుతారు. దీంతో ప్రొడ్యూసర్ గా నా కెరీర్, డైరెక్టర్ గా నాగేశ్వరరావు, హీరోగా నీ కెరీర్‌ సెట్ అయ్యిపోతుంది” అంటూ వర్మ తన లాజిక్ చెప్పాడట. ఇక ఆ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద క్రమంగా పుంజుకుని సూపర్ హిట్టుగా నిలిచింది.

 

Also Read : Kollywood : ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా? ఆ హీరో భార్య కూడా ఈ ఫొటోలో ఉండటం విశేషం..

  Last Updated: 15 Jul 2023, 09:21 PM IST