Site icon HashtagU Telugu

RGV-Nagababu : మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి..నాగబాబు కు వర్మ రిప్లై

Nagababu Rgv

Nagababu Rgv

మరోసారి మెగా బ్రదర్ నాగబాబు (Nagababu)..వర్మ (Varma) ఫై పంచ్ లు వేశారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వ్యూహం (Vyuham) సినిమా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ జగన్ నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ. ఈ వ్యూహం మూవీలో చంద్రబాబు, లోకేశ్, చిరంజీవి, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా చూపించారంటూ ..ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ నారా లోకేశ్ హైకోర్టును ఆశ్రయించగా..దీనిపై ఈరోజు తీర్పు ప్రకటించనుంది.

సమాజానికి కంటకంగా మారిన రాంగోపాల్‌ వర్మ (Ram Gopal Varma) తలను నరికి తెచ్చిన వారికి రూ. కోటి నజరానా చెల్లిస్తానంటూ ఓ టీవీ లైవ్‌ లో కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేయడం ఫై వర్మ స్వయంగా డీజీపీ ఆఫీస్ కు వెళ్లి తనను చంపేందుకు రూ. కోటి ఆఫర్ ప్రకటించిన కొలికపూడి శ్రీనివాసరావుపై, ఆయనను రెచ్చగొట్టేలా మాట్లాడిన యాంకర్ సాంబశివరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోాలని పిర్యాదు చేసాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ పిర్యాదు ఫై నాగబాబు స్పందించారు. ‘‘ఆర్జీవీ గారిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు.. నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్జీవీ గారూ మీరేం భయపడకండి. మీ జీవితానికి ఏ ఢోకా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఏపీలో.. ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిక వెధవా మీకెటువంటి హానీ తలపెట్టడు. ఎందుకంటే హీరో, విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్‌ గాడ్ని ఎవడూ చంపడు కదా! మీరేం వర్రీ అవకండి. నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి’’ అని పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దీనిపై వర్మ తనదైన స్టయిల్ లో రివర్స్ పంచ్ వేశారు.

‘సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే , నా సినిమాలో మీరు ..మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి..అని రిప్లయ్ ఇచ్చాడు. మొత్తం మీద మరోటి వర్మ నీకు సాటి ఎవ్వరు లేరుపో..అంటూ ఈ ట్వీట్ చూసిన వారంతా కామెంట్స్ పెడుతున్నారు.

Read Also : Vijayakanth Passed Away: ప్రముఖ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూత