RGV : ఆమె అందం నుండి వర్మ బయటకు రాలేకపోతున్నాడు..

ఇంత వరకు ఎంతో మంది చీరకట్టులోని అందం గురించి అభివర్ణించారు.. చెప్పారు.. కానీ నేను ఎప్పుడూ నమ్మలేదు.. కానీ నిన్ను చూశాకా నాకు అర్థమైంది.. చీరకట్టులోని అందం ఇంత గొప్పగా ఉంటుందా? అని అర్థమైందన్నట్టుగా ఓ పోస్ట్

Published By: HashtagU Telugu Desk
Rgv Sreelakshmi Satheesh Sa

Rgv Sreelakshmi Satheesh Sa

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)..సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియా తో పాపులర్ అయ్యాడని చెప్పాలి. ఒకప్పుడు వర్మ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉండేది..వర్మ సినిమా అంటే సినీ ప్రముఖులు సైతం థియేటర్స్ కు క్యూ కట్టేవారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చాలామంది ఆయన శిష్యులే. అలాంటి వర్మ..ప్రస్తుతం డిజాస్టర్లకు కేరాఫ్ గా ..వివాదాలకు అడ్డాగా మారిపోయాడు. ప్రస్తుతం ఈయన నుండి సినిమా అంటే కనీసం పోస్టర్లు ఖర్చు అంత కూడా రానిపరిస్థితి. అంత దిగజారిపోయాడు. ఎన్ని చెత్త సినిమాలు చేసిన..ఆయన క్రేజ్ మాత్రం తగ్గలే, నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటాడు.

రెండు రోజులుగా వర్మ..శ్రీలక్ష్మీ (Sreelakshmi Satheesh) అందం నుండి బయటకు రాలేకపోతున్నాడు. నిత్యం ఆమె జపమే చేస్తున్నాడు. ఇంతకీ శ్రీలక్ష్మీ ఎవరా అనుకుంటున్నారా..మలయాళం రీల్ వీడియోలు చేస్తూ సినిమా ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది. ఇటీవలే ఈమె తాలూకా రీల్ వీడియో వర్మ కంటపడింది. అంతే ఆమె అందానికి ముగ్దయైన వర్మ..ఆమె డీటెయిల్స్ కనుగొనే పనిలో పడ్డాడు. తాజాగా ఆమెతో సినిమా చేసేందుకు రెడీ అన్నట్టుగా వర్మ చెప్పేశాడు.

Read Also: Cauvery Row : హీరో సిద్ధార్థ్‌కు తగిలిన ‘కావేరి’ సెగ..

ఇంత వరకు ఎంతో మంది చీరకట్టులోని అందం గురించి అభివర్ణించారు.. చెప్పారు.. కానీ నేను ఎప్పుడూ నమ్మలేదు.. కానీ నిన్ను చూశాకా నాకు అర్థమైంది.. చీరకట్టులోని అందం ఇంత గొప్పగా ఉంటుందా? అని అర్థమైందన్నట్టుగా ఓ పోస్ట్ వేసి రీల్ వీడియోను షేర్ చేశాడు. అందులో సినిమా గురించి ప్రకటించాడు. ఆమెతో నేను శారీ (చీర) అనే సినిమా తీస్తాను అని ప్రకటించాడు. ఇక ఈ పోస్ట్‌ను శ్రీలక్ష్మీ తన ఇన్ స్టా స్టోరీలో పెట్టేసుకుంది. అంటే తనకు కూడా అంగీకారమే అని చెప్పకనే చెప్పింది. ఇక మలయాళంలో తన మీద, ఆర్జీవీ మీద వచ్చిన వార్తను కూడా షేర్ చేసుకుంది. అంటే శ్రీలక్ష్మీ సైతం వర్మతో మీటింగ్ కూడా రెడీగా ఉందన్నమాట. మరి శ్రీలక్షి తో వర్మ ఎలాంటి సినిమా చేస్తాడు..? శ్రీలక్ష్మిని ఎలాంటి యాంగిల్స్ లలో చూపిస్తాడు..? అనేది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

https://www.instagram.com/reel/CxvFuYYJp4j/?utm_source=ig_web_copy_link

  Last Updated: 29 Sep 2023, 12:21 PM IST