Site icon HashtagU Telugu

RGV Kalki : కల్కి కి షాక్ ఇచ్చిన వర్మ..ఇలా చేస్తాడని ఎవరు ఊహించరు

Varma Kalki

Varma Kalki

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కల్కి (kalki 2898 AD ) మేనియా నడుస్తుంది. ఎక్కడ చూసిన..ఏ నోటా విన్న కల్కి పేరే వినిపిస్తుంది. అర్ధరాత్రి నుండే అభిమానులు థియేటర్ల దగ్గరకు చేరుకుని బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. వరల్డ్​ వైడ్​గా దాదాపు 10 వేలకు పైగా స్క్రీన్స్​లో కల్కి ని విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకు ఐదు , ఆరు షోల తో సందడి చేయబోతుంది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ కల్కి 2898 AD తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, దిశా పటాని, యూనివర్స్ స్టార్ కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటి శోభన, మాళవిక నాయర్ ఇలా ఎంతో మంది ఈ మూవీ లో నటించి మెప్పించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు వారి అనుభూతిని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. అలాగే సినిమాలోని హైలైట్స్ ను తమ ఫోన్ లలో చిత్రీకరించి..సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తుండడం తో సినిమా చూడని వారికీ..చూడాలంటే ఆత్రుత కల్పిస్తున్నారు. కాగా ఈ మూవీ లో ముగ్గురు అనుకోని గెస్ట్ లు కనిపించేసరికి ఒకిత్త ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. వారే రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , విజయ్ దేవరకొండ, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ లు ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఓ బిజినెస్ డీలర్‌గా కనిపించాడు. అంతేకాదు, ప్రభాస్‌కే షాకిచ్చేలా తనదైన డైలాగులతో మెప్పించాడు. ఇక, స్క్రీన్‌పై వర్మ కనిపించగానే థియేటర్లు అన్నీ దద్దరిల్లిపోయేలా ప్రేక్షకులు కేకలు వేసినట్లు వీడియో లలో తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

Read Also ; Sengol From Parliament: సెంగోల్‌పై వివాదం.. పార్ల‌మెంట్ నుంచి తొలగించాల‌ని డిమాండ్‌..!