RGV with Ashu Reddy: దటీజ్ వర్మ.. ఆశురెడ్డి కాళ్లకు ముద్దు పెట్టి, మసాజ్ చేసి!

రాంగోపాల్ వర్మ మరోసారి అశురెడ్డితో కనిపించి రచ్చ రచ్చ చేశాడు. ఎందుకో తెలుసా..

Published By: HashtagU Telugu Desk
RGV Ashu Reddy

Ashu Reddy

రామ్ గోపాల్ వర్మ (RGV)  తన సినిమాల ప్రమోషన్ కోసం ఎంతకైనా తెగిస్తారు. నటీమణులతో సంభాషించే విషయంలో కూడా అతనికి ఎలాంటి అడ్డంకులు లేవు. సోషల్ మీడియాలోనూ, బహిరంగంగానూ హీరోయిన్స్ రొమాన్స్ చేస్తాడు. తాజాగా నటి ఆశు రెడ్డి రామ్ గోపాల్ వర్మ (RGV) తనకు పాదాలకు మసాజ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫోటోలో ఆశు రెడ్డి (Ashu Reddy) తన టాప్ గౌన్‌లో సోఫాలో కూర్చొని ఉండగా, నేలపై RGV ఆమె పాదాలకు మసాజ్ చేస్తున్నట్లుగా వీడియోలో చూడొచ్చు.

మర్మ తన రాబోయే చిత్రం ‘డేంజరస్’ కోసం ఒక ప్రచార వీడియోలో ఆమెతో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ చిత్రంలో అప్సర రాణి, నైనా గంగూలీ లెస్బియన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి అతను చాలా మంది యువ నటీమణులు, టెలివిజన్ ప్రముఖులతో సందడి చేశాడు. రామ్ గోపాల్ వర్మ గతంలో ఆశు రెడ్డి(Ashu Reddy)తో ఒక వీడియో ఇంటర్వ్యూను నిర్వహించాడు. అందులో అతను ఆమె తొడలను దేనికంటే ఇష్టపడతానని బహిరంగంగా చెప్పాడు. తనకు ప్రేమ కంటే కామమే ఇష్టమని వర్మ తేల్చి చెప్పాడు. ప్రస్తుతం వర్మ, అశురెడ్డి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

https://youtu.be/ql31Oik9yVM

Also Read: Venkatesh Narappa: నారప్ప మళ్లీ వస్తున్నాడప్పా!

  Last Updated: 07 Dec 2022, 12:52 PM IST