Site icon HashtagU Telugu

RGV Tweet: అమ్మా నేను మంచి కొడుకును కాదు…ఆర్జీవీ స్పెషల్ ట్వీట్..!!

RGV mother

RGV mother

రామ్ గోపాల్ వర్మ…సంచలనాలకు మారుపేరు. ఆ పేరులోనే…ప్రత్యేకత ఉంది. ఏ విషయాన్నైనా సూటిగా…వివాదాస్పదంగా చెప్పడం ఆర్జీవీకి తప్పా ఇంకేవ్వరికీ రాదు. ఇవాళ మదర్స్ డే సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. డిఫరెంట్ గా తన మాతృమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు. తాను మంచి కొడుకును కానంటూ వ్యాఖ్యనించారు.

ట్వీట్ లో ఏముందంటే….హ్యాపీ మదర్స్ డే మామ్. నేను మంచి కొడుకును కాదు..కానీ…తల్లిగా నువ్వు మంచితనం కన్నా ఎక్కువ అంటూ…అంటూ చేతిల గ్లాస్ పట్టుకుని తన తల్లితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. తన మాతృమూర్తిపై ఉన్న ప్రేమను చాటుతూ పొస్టు చేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. మీలో ఈ యాంగిల్ ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సర్ మీరు మారిపోయారు…అంటూ జోకులు పేలుస్తున్నారు. అంతేకాదు ఈ పోస్టు పెట్టింది మీరేనంటూ అడుగుతున్నారు. ఓ యూజర్ అయితే….ఎంత పెద్ద ఎదవైనా అమ్మ `ముందు పసివాడేనంటూ కామెంట్ చేశాడు. ఆర్టీజీవి ఇలాంటి పోస్టు పెట్టడం…నెటిజన్లకు షాకిచ్చినట్లే..!!

Exit mobile version