Site icon HashtagU Telugu

Gaddar: గాడ్ ఫాదర్ తో గద్దరన్న.. చిరుతో కాంబినేషన్ సీన్స్!

Gaddar

Gaddar

తెలంగాణకు చెందిన విప్లవ ఉద్యమకారుడు, ప్రజా సంక్షేమం కోసం తన వాయిస్‌ని ఎత్తడంలో ఎప్పుడూ ముందుండే గద్దర్ చిరంజీవి గాడ్‌ఫాదర్‌లో అతిధి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. గద్దర్ కూడా ఈ స్క్రిప్ట్ ను బాగా ఇష్టపడ్డాడు. గద్దర్ ను అతిధి పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారని, వైజాగ్ షెడ్యూల్‌లో ఆయన నటించే సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. అయితే చిరంజీవితోనూ గద్దర్‌ కాంబినేషన్‌ సీన్స్‌ ఉంటాయి. చిరంజీవి తండ్రికి స్నేహితుడిగా తాను కనిపిస్తానని గద్దర్ చెప్పారు. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేశానని, తనకు మంచి పారితోషికం కూడా ఇచ్చారని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

గాడ్ ఫాదర్ అనేది మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ తెలుగు రీమేక్. దీనికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి నటించే సినిమాలో విలన్ పాత్ర కోసం సీనియర్ తమిళ నటుడు మాధవన్‌ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు కూడా వినిపిస్తోంది. గాడ్‌ఫాదర్‌లో నయనతార, సత్య దేవ్ మరియు అనసూయ కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version