Site icon HashtagU Telugu

Sankranthiki Vasthunam : సారీ చెప్పిన బుల్లి రాజు

Bulliraju

Bulliraju

సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాలు వచ్చినప్పటికీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాలు మాత్రం రెండే. అందులో ఒకటి ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam). వెంకటేష్ – అనిల్ రావిపూడి కలయికలో ఎఫ్ 2 , ఎఫ్ 3 తర్వాత వచ్చిన ఈ మూవీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు బుల్లిరాజు పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారు. తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచాడు.

సినిమాలో బుల్లి రాజుగా ఆకట్టుకున్న బాలనటుడు రేవంత్ (Revanth) తాజాగా ప్రేక్షకులకు ,ప్రజలకు క్షమాపణలు తెలిపారు. ‘సినిమాలో చూపించినట్లు నా లాగా ఓటీటీలు చూసి ఎవరూ పాడు అవ్వొద్దు. నా లాగా తిట్టవద్దు. ఒక మెసేజ్ కోసం సినిమాలో ఇలా చేశాం అంతే’ అని సక్సెస్ మీటింగ్లో సారీ చెప్పారు. కాగా ఈ మూవీలో బుల్లి రాజు డబుల్ మీనింగ్తో బూతులు మాట్లాడాడని పలువురు నెట్టింట విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ క్షమాపణలు తెలిపాడు.

ఇక ఈ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే..

మొదటి రోజే ఈ సినిమా దేశ వ్యాప్తంగా 45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండవ రోజు కూడా అదే జోరును కొనసాగించింది. రెండో రోజు 30 కోట్లు , రెండు రోజుల్లోనే ఈ మూవీ 77 కోట్లకు పైగా వసూలు చేసి, మూడవరోజు ఈ మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి, వెంకీ మామకు బ్లాక్ బస్టర్ పొంగల్ అన్పించింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా 3 రోజుల్లోనే ఏకంగా 106 కోట్ల గ్రాస్ ని రాబట్టింది అంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు అఫీషియల్ గా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దానిపై “ఎనీ సెంటర్… సింగల్ హ్యాండ్… విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ పొంగల్… త్రీ డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ 106 కోట్లు” అంటూ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరిందన్న విషయాన్ని వెల్లడించారు.