Resul Pookutty On RRR: ఆర్ఆర్ఆర్ ‘గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్స్ వైరల్!

ఆస్కార్ విన్నింగ్ సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి పరిచయం అక్కర్లేని పేరు.

Published By: HashtagU Telugu Desk
Rrr

Rrr

ఆస్కార్ విన్నింగ్ సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి పరిచయం అక్కర్లేని పేరు. ఈయన ఎన్నో ఇండియన్ మూవీస్ కు పనిచేశారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా మూవీ అందర్నీ ఆకట్టకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీపై రెసూల్ షాకింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ ఓ ‘గే లవ్ స్టోరీ’ అని కామెంట్ చేశారు. రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో అలియా భట్‌ను ‘ఆసరా’గా ఉపయోగించారని అన్నారు. రెసూల్ వ్యాఖ్యలపై అభిమానులు కోపంగా రియాక్ట్ అయ్యారు. అలాంటి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణమని అన్నారు.

RRR అనేది 1920ల పూర్వ స్వతంత్ర యుగంలో జరిగిన కల్పిత కథ. ఇద్దరు నిజ జీవిత విప్లవకారుల జీవితాల ఆధారంగా రూపొందించబడింది.  అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్, వరుసగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తమ తమ పాత్రలను పోషించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ కొంతమందిని ఆకట్టుకోలేకోవడంలో విఫలమైంది.

ఆదివారం, నటుడు-రచయిత మునీష్ భరద్వాజ్ ఒక ట్వీట్‌లో RRRని ‘చెత్త’ అని కామెంట్ చేశాడు. అతని ట్వీట్‌పై రెసూల్ స్పందించి “గే లవ్ స్టోరీ” అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ కావడంతో అభిమానులు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆస్కార్ స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేస్తారని అనుకోలేదని అన్నారు. భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరురావడంతో అవన్నీ జీర్ణించుకోలేక ఇలా కామెంట్స్ చేస్తున్నారని ఫ్యాన్స్ గట్టిగా సమాధానమిచ్చారు. భాషతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ గౌరవించాలని సూచించారు. గతంలో రాంగోపాల్ వర్మతో పాటు మరికొంతమంది ఇది LGBTQ మూవీ అని కామెంట్స్ చేశారు.

https://twitter.com/resulp/status/1543676540571242496

 

 

  Last Updated: 04 Jul 2022, 02:34 PM IST