Site icon HashtagU Telugu

Renu Desa: అనారోగ్యం అంటూ రేణు దేశాయ్‌ షాకింగ్‌ పోస్ట్‌.. నెట్టింట్లో వైరల్!

Whatsapp Image 2023 02 14 At 18.48.27

Whatsapp Image 2023 02 14 At 18.48.27

Renu Desai: పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్ అందరికీ సుపరిచితురాలే. బద్రి సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆమె తర్వాత పవన్ దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమా చేసింది. రెండు సినిమాల తర్వాత పవన్‌తో సహజీవనం చేసి పిల్లాడిని కన్న తర్వాత వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఇది సెన్సెషనల్‌ టాక్‌గా నడిచింది. ఆ తర్వాత పవన్‌-రేణు దేశాయ్‌కి మధ్య మనస్పర్ధలతో
2011లో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం పిల్లలతో పూణేలో ఉంటున్న రేణు…… అడపాదడపా హైదరాబాద్ వస్తూ కొన్ని కొన్ని టెలివిజన్ షోలు.. ఇటీవల పాలు సినిమాలలో కీలకపాత్రలు చేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత…. చాలాకాలం ఇండస్ట్రీకి హైదరాబాద్ కి దూరంగా ఉండటం జరిగింది.

కానీ పిల్లలు పెద్దవాళ్లవుతున్న తరుణంలో నెమ్మదిగా అంటే కొన్ని సంవత్సరాల నుంచి మళ్లీ భాగ్యనగరం రావడం స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే తాను అనారోగ్యానికి గురైనట్లు స్వయంగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరినీ షాక్‌కు గురి చేసింది. పవన్‌తో రేణు విడుపోయినప్పటికీ… మెగా ఫ్యాన్స్‌ ఆమెకు ఎప్పుడు తిట్టలేదు. పైగా ఆ రెస్పెక్ట్‌ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆమె అభిమానులతో పాటు… సేనాని అభిమాలు సైతం రేణు దేశాయ్‌కు ఏమైందని కంగారు పడ్డారు. సోషన్‌ మీడియా వేదికగా వెతకటం ప్రారంభించారు.

రేణు దేశాయ్‌ ఆరోగ్యం విషయాల్లోకి వెళ్తే.. గుండె మరియు ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లు ఆ పోస్ట్‌లో చెప్పుకొచ్చింది. వాటిని ఎదుర్కోవటానికి శక్తిని కూడా పెట్టుకుంటున్నట్లు తెలియజేసింది. ఇలా ఎవరైనా బాధపడుతున్నారంటే… వాళ్లు ఎలాంటి పరిస్థితులలో ఉన్న.. ధైర్యం కోల్పోకుండా జీవితంలో బలంగా నిలబడాలనే విషయాన్ని తన పోస్టులో రేణు వివరించింది.

మరోవైపు ఇటీవల ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు వరుస పెట్టి అనారోగ్యాలకు గురవుతున్నారు. హీరోయిన్ సమంత మయోసైటీస్ వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. అలాగే సీనియర్ హీరోయిన్ భానుప్రియ సైతం తన భర్త చనిపోయాక అనారోగ్యానికి గురైనట్లు ఏ విషయం గుర్తుండటం లేదని చెప్పుకొచ్చింది. కాగా ఇప్పుడు రేణు దేశాయ్ అనారోగ్యానికి గురికావడం సంచలనంగా మారింది. ప్రస్తుతం రేణు దేశాయ్ .. రవితేజ హీరోగా చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.