గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) దంపతులకు పవన్ కళ్యాణ్ మాజీ భార్య , నటి రేణుదేశాయ్ (Renu desai ) కృతజ్ఞతలు తెలిపింది. రేణూ దేశాయ్‌కు మూగ జీవాలు అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉన్న సంగతి తెలిసిందే. వాటి సంక్షేమం కోసం “శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్” (Sri Adya Animal Shelter) అనే ఎన్జీవోను స్థాపించింది. దీని ద్వారా ఎన్ని కార్యకలాపాలను చేస్తుంది. రేణూ దేశాయ్ ఈ సంస్థకు విరాళాలు ఇవ్వాలని అనేక సార్లు కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేసింది.
తాజాగా ఈ సంస్థ కోసం రేణూ దేశాయ్ ఒక అంబులెన్స్‌ను కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. అలాగే ఈ అంబులెన్స్ కొరకు రామ్ చరణ్ పెంపుడు శునకమైన రైమీ విరాళం ఇచ్చినట్లు వివరించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అంబులెన్స్ కొనుగోలు చేస్తున్నప్పుడు తీసిన ఫోటోను పంచుకుని, రామ్ చరణ్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. రామ్ చరణ్ దంపతులకు మూగ జీవాలంటే ఎంత ప్రేమ అనేది ఈ సంఘటనతో మరోసారి రుజువైంది.
Read Also : Bandi Sanjay : సుద్దపూస ఇప్పుడేమంటాడో.. కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్