Renu Desai : ‘కూటమి పార్టీ’ గుర్తును టాటూ గా వేసుకున్న రేణు దేశాయ్..

కమలం పువ్వుని కూడా టాటూగా వేయించుకుంది. కానీ ఆమె చివర్లో ఎలక్షన్ 2024 అనే హ్యాష్ టాగ్ జోడించింది

Published By: HashtagU Telugu Desk
Renu Post

Renu Post

రేణు దేశాయ్ (Renu Desai)..పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. బద్రి (Badri) సినిమాతో టాలీవుడ్ కు పరిచమైన ఈమె..అదే చిత్రంలో హీరోగా నటించిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ప్రేమలో పడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో సహజీవసం చేసి ఇద్దరు బిడ్డలకు తల్లయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం , విడాకులు తీసుకోవడం, ఎవరికీ వారు బ్రతుకుతుండడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె సోషల్ మీడియా ద్వారా మాత్రం నిత్యం అభిమానులకు టచ్ లోనే ఉంటూ వస్తుంది. రాజకీయ విషయాలతో పాటు అప్పుడప్పుడు ఫ్యామిలీ విషయాలు షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా కొనసాగుతున్న వేళ ఓ పార్టీ గుర్తును తన చేతికి టాటూ (Tatoo) వేసుకోవడం అమ్మడిని వార్తల్లో నిలిచేలా చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

రేణు దేశాయ్ తన చేతికి వేయించుకున్న టాటూ చూపిస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తన చేతిపై ‘మౌనం పరం శీలం’ అనే కొటేషన్ ని టాటూగా వేయించుకుంది. అలాగే కమలం (NDA Alliance) పువ్వుని కూడా టాటూగా వేయించుకుంది. కానీ ఆమె చివర్లో ఎలక్షన్ 2024 అనే హ్యాష్ టాగ్ జోడించింది. దీంతో రేణు దేశాయ్ పరోక్షంగా ఈ ఎన్నికల్లో బిజెపికి మద్దతు తెలుపుతున్నట్లు చెప్పకనే చెపుతుందని బిజెపి శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్ ..బిజెపి తో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగగా..ఇప్పుడు ఏపీలో లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి , టిడిపి తో కలిసి బరిలోకి దిగుతున్నారు. ముగ్గురు కలిసే ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ఈ తరుణంలో రేణు దేశాయ్ కమలం గుర్తు వేయించుకునే సరికి..రేణు తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ కే మద్దతు తెలుపుతున్నట్లు ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

Read Also : Kejriwal : అరవింద్‌ కేజ్రీవాల్‌ క‌స్ట‌డీ ఏప్రిల్ 23 వ‌ర‌కు పొడ‌గింపు

  Last Updated: 15 Apr 2024, 04:12 PM IST