Site icon HashtagU Telugu

Akira Nandan : కర్రసాము చేస్తున్న అకిరా.. వీడియో షేర్ చేసిన రేణూదేశాయ్..

Renu Desai Shares Pawan Kalyan Son Akira Nandan New Video

Renu Desai Shares Pawan Kalyan Son Akira Nandan New Video

Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ సినిమా ఎంట్రీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తన లుక్స్ తో అకిరా.. వింటేజ్ పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నాడు. కేవలం లుక్స్ మాత్రమే కాదు, తన అలవాట్లు, యాక్షన్స్ తో కూడా పవన్ ని గుర్తు చేస్తున్నాడు. పవన్ అంటే తెలుగు ఆడియన్స్ కి ముందుగా గుర్తుకు వచ్చే విషయం ‘మార్షల్ ఆర్ట్స్’. సినిమాల్లో రావడానికి ముందే వాటిలో శిక్షణ పొందిన పవన్.. తన మొదటి సినిమాలోనే వాటిని ప్రదర్శించి యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నారు.

ఆ తరువాత సినిమాల్లో కూడా పవన్ ఆ మార్షల్ ఆర్ట్స్ ని అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ వచ్చారు. పవన్ మార్షల్ ఆర్ట్స్ చేసే విధానంలో ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ తమ అభిమానులకు బాగా నచ్చేస్తుంది. ఇక పవన్ దారిలోనే ఆయన వారసుడు అకిరా కూడా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతూ వస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలను రేణూదేశాయ్.. తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పవన్ అభిమానుల ముందుకు తీసుకు వస్తారు. తాజాగా అకిరా కర్రసాము చేస్తున్న వీడియోని రేణూదేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసారు.

‘మై సమురాయ్ బేబీ’ అంటూ ఒక చిన్న వీడియో బైట్ ని రేణూదేశాయ్ షేర్ చేసారు. ఆ వీడియోలో అకిరా కర్రతిప్పే స్టైల్ చూసి.. అచ్ఛం పవన్ కళ్యాణ్ లాగానే తిప్పుతున్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలోని అకిరా లుక్స్ చూస్తుంటే.. పాత వీడియో అని తెలుస్తుంది. ఎప్పటిదో వీడియో రేణూదేశాయ్ ఇప్పుడు షేర్ చేసినట్లు అర్ధమవుతుంది. కాగా ప్రస్తుతం ఈ వారసుడు విదేశీ ఫిలిం స్కూల్ లో తన గ్రాడ్యువేషన్ ని చేస్తున్నాడు. అక్కడ ఫిలిం ప్రొడక్షన్ అండ్ మ్యూజిక్ పై పాటలు నేర్చుకుంటున్నాడు.