Site icon HashtagU Telugu

Renu Desai : మహేష్ బాబు సినిమాతోనే రేణు దేశాయ్ కి రీ ఎంట్రీ ఇవ్వాల్సింది.. కానీ..

Renu Desai Rejected Mahesh Babu Movie for her Re Entry

Renu Desai Rejected Mahesh Babu Movie for her Re Entry

నటి, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) దాదాపు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. రవితేజ(Raviteja) నటించిన టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమాతో నేడు అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకి వచ్చింది రేణు దేశాయ్. ఈ సినిమాలో హేమలత లవణం అనే ఓ పవర్ ఫుల్ పాత్రని చేసింది.

టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటంతో ప్రమోషన్స్ లో బాగా యాక్టివ్ గా పాల్గొన్నారు రేణు దేశాయ్. వరుసగా అనేక ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికర విషయాలను కూడా బయటపెట్టారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు(Mahesh Babu) సినిమాతోనే రీ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది కానీ కుదరలేదు అని చెప్పింది.

రేణు దేశాయ్ మాట్లాడుతూ.. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నాకు ఆఫర్ వచ్చింది. ఆ సినిమాలో బ్యాంక్ మేనేజర్ గా నదియా పోషించిన పాత్ర ముందు నాకు ఆఫర్ చేశారు. నాకు ఆ పాత్ర కూడా నచ్చింది, చేద్దామనుకున్నాను. కానీ కొన్ని కారణాలతో ఆగిపోయాను. ఆ కారణాలేంటో నేను ఇప్పుడు చెప్పలేను, మళ్ళీ అనవసరంగా సోషల్ మీడియాలో కాంట్రవర్సీ అవుతుంది. అలా ఆ సినిమా ఆఫర్ ని వదులుకున్నాను అని తెలిపింది.

దీంతో ఆ కారణాలేంటి? పాత్ర నచ్చినా రేణు దేశాయ్ మహేష్ బాబు సినిమాలో ఎందుకు చేయలేదు అని అభిమానులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Also Read : Johnny Master : డ్యాన్సర్స్ యూనియన్ ప్రసిడెంట్ గా జానీ మాస్టర్..