Site icon HashtagU Telugu

Renu Desai : ‘భయపడేవాడు నిజాయితీగా ఉండలేడు’ రేణుదేశాయ్ కీలక పోస్ట్..ఎవరిపైనో..?

Renu Desai

Renu Desai

పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా పేరుగాంచిన రేణు దేశాయ్ (Renu Desai) మీడియా కు దూరంగా ఉండేవారు. కానీ ఇటీవలి కాలంలో తెలుగు మీడియాకు ఎక్కువగా టచ్ లో ఉంటున్నారు . పుణేలో తన ఇద్దరు పిల్లలతో నివసిస్తూ, ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు, భావోద్వేగాలు అభిమానులతో పంచుకుంటూ వచ్చారు. తాజాగా ఆమె తరచూ హైదరాబాద్‌కి రావడంతో పాటు మీడియా కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

Lucky : అదృష్టం అంటే ఇతడిదేపో.. రూ.లక్ష పెట్టి రూ.80 కోట్లు కొట్టేసాడు

ఈ క్రమంలో తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఓ మెసేజ్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ ఆంగ్ల రచయిత థామస్ పైన్ చెప్పిన దాన్ని పంచుకున్నారు. “నిజాయితీగా ఉండాలంటే, కొంతమందిని నొప్పించడానికైనా సిద్ధంగా ఉండాలి. ఎవరినైనా నొప్పించడానికి భయపడేవాడు నిజాయితీగా ఉండలేడు.” అని పేర్కొంటూ షేర్ చేసిన ఆమె పోస్ట్, ఆమె మనోభావాలను ప్రతిభింబిస్తుంది.

ఈ పోస్టు ద్వారా రేణు దేశాయ్ ఎవరి గురించి చెప్పాలనుకున్నారన్నది స్పష్టంగా చెప్పలేకపోయినా, నెటిజన్లు ఈ మాటల వెనుక అంతర్మథనం ఉందని చర్చిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో మార్పులు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో, ఈ పోస్ట్ కాస్తా ఉత్కంఠ కలిగించేలా ఉంది. ఎప్పుడూ సామాన్యంగా, సూటిగా మాట్లాడే రేణు దేశాయ్ తాజా పోస్ట్ మరోసారి ఆమె నేరుగా కాకుండా భావోద్వేగాల ద్వారా మాట్లాడిన విధంగా భావిస్తున్నారు.