Renu Desai : అరుదైన వ్యాధితో బాధపడుతున్న రేణు దేశాయ్..

తాను చిన్నప్పటి నుండి గుండె సమస్య తో బాధపడుతున్నట్లు తెలిపి షాక్ ఇచ్చింది. ఇది జన్యుపరమైన సమస్య దీనిని ‘మయోకార్డియల్ బ్రిజింగ్’ అంటారని తెలిపింది.

  • Written By:
  • Publish Date - October 13, 2023 / 03:41 PM IST

ఇటీవల సినీ తారలు (Actress) చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. వెండితెరపై ఎంతో అందంగా కనిపించే ఈ భామలు..రియల్ లైఫ్ లో మాత్రం అరుదైన వ్యాధులతో చావుతో పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం సమంత మయోసిటిస్ (Samantha Myositis) అనే అరుదైన వ్యాధి తో బాధపడుతుంది. దీనికి సంబదించిన చికిత్స తీసుకుంటుంది. ఇందుకోసం కొంతకాలం పాటు సినిమాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించింది.

ఈమెతో పాటు పలువురు హీరోయిన్స్ సైతం రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఉంది. రేణు దేశాయ్ (Renu Desai) .. గురించి ప్రత్యేకంగా సినిమా లవర్స్ కు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్, యాక్టర్, ఎడిటర్, ప్రొడ్యూసర్, కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇలా అనేక రంగాల్లో తన టాలెంట్ ను చూపించి అలరించారు.

We’re now on WhatsApp. Click to Join.

రేణు దేశాయ్ 2003 లో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన బద్రి (Badri) సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన రేణుదేశాయ్.. పవన్ కళ్యాణ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వీళ్లిద్దరికీ అఖీరా, ఆద్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.. కొంత కాలానికి పలు కారణాల చేత వీళ్లిద్దరు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా రేణుదేశాయ్ మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageswara Rao) సినిమాతో మళ్ళీ చిత్రసీమలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.

దసరా కానుకగా ఈ నెల 20 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న రేణు..సినిమా విశేషాలతో పాటు తన హెల్త్ కు సంబదించిన విషయాలను సైతం షేర్ చేసుకుంది. తాను చిన్నప్పటి నుండి గుండె సమస్య తో బాధపడుతున్నట్లు తెలిపి షాక్ ఇచ్చింది. ఇది జన్యుపరమైన సమస్య దీనిని ‘మయోకార్డియల్ బ్రిజింగ్’ (Myocardial Bridging) అంటారని తెలిపింది. అయితే ఈ సమస్య వల్ల ఒక్కోసారి గుండె వేగంగా కొట్టుకోవడం, ఆయాసంగా అనిపించడం, చెమటలు పట్టడం, హార్ట్ ఎటాక్ వచ్చినట్లు అనిపిస్తుందని.. ప్రస్తుతం దీనికి సంబంధించి చికిత్స తీసుకుంటూ మందులు వాడుతున్నట్లు చెప్పుకొచ్చారు.

Read Also : Ponnala – BRS : కారెక్కనున్న పొన్నాల ? ఆయన కామెంట్స్ లో అంతరార్ధం అదే ?