Site icon HashtagU Telugu

Renu Desai : టీడీపీ అభ్యర్థిని గెలిపించండి అంటూ రేణూదేశాయ్ పోస్ట్ వైరల్..

Renu Desai Campaigning Post About Tdp Leader Anagani Satya Prasad

Renu Desai Campaigning Post About Tdp Leader Anagani Satya Prasad

Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంటారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు పవన్ వారసులు అకిరా నందన్, ఆద్య విషయాలను కూడా రేణూ షేర్ చేస్తుంటారు. అలాగే అప్పుడప్పుడు పొలిటికల్ గా కూడా కొన్ని కామెంట్స్ చేస్తుంటారు. ఈక్రమంలోనే తాజాగా ఓ టీడీపీ అభ్యర్థిని గెలిపించాలంటూ కోరుతూ ప్రత్యేక పోస్ట్ వేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ జనసేన, బీజేపీతో కలిసి వెళ్తున్న విషయం తెలిసిందే. దీంతో టీడీపీ అభ్యర్థుల కోసం పవన్ కూడా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలో రేణూ దేశాయ్ సైతం టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతూ పోస్ట్ వెయ్యడం జనసైనికులను ఆకట్టుకుంటుంది. రేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అనగాని సత్యప్రసాద్ ని గెలిపించాలంటూ రేణూ దేశాయ్ పోస్ట్ వేశారు. అంతేకాదు, ఆ పోస్ట్ కి ఇలా కామెంట్ కూడా రాసుకొచ్చారు.. “మే 13న ఎన్నికల్లో సత్యప్రసాద్ అన్నయ్య మంచి జరగాలని కోరుకుంటున్నాను” అంటూ వెల్లడించారు.

రేణూ దేశాయ్ కి, సత్యప్రసాద్ కి ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా..? అనగాని సోదరి డాక్టర్ కమల.. రేణూ దేశాయ్ కి మంచి స్నేహితురాలిని సమాచారం. ఈ బంధంతోనే రేణూదేశాయ్ అనగానికి మద్దతు తెలుపుతూ పోస్ట్ వేసినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే, మెగా ఫ్యామిలీ మెంబెర్ అయిన అల్లు అర్జున్.. నిన్న వైసీపీ లీడర్ ఇంటికి వెళ్లి మరి తన మద్దతు తెలపడం పై జనసైనికులతో పాటు టీడీపీ ఫాలోవర్స్ కూడా ఖండిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం అల్లు అర్జున్ పర్యటన గురించి మాట్లాడుతూ.. వైసీపీ పై విమర్శలు చేయడం గమనార్హం.