Site icon HashtagU Telugu

Renu Desai Is Back: ‘టైగర్ నాగేశ్వరరావు’తో రేణు దేశాయ్ పవర్ ఫుల్ ఎంట్రీ!

Renudesai

Renudesai

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు. రాజీ లేని భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు1970 స్టువర్ట్‌పురం నేపధ్యంలో పేరు మోసిన దొంగ బయోపిక్ గా రూపొందుతోంది.

ఈ చిత్రంలో రేణు దేశాయ్ పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఈ రోజు ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో రేణు దేశాయ్ హేమలత లవణం అనే చాలా ముఖ్యమైన, పవర్ ఫుల్ పాత్రను పోషిస్తోంది. ఇది నిజ జీవిత పాత్ర. హేమలత లవణం భారతీయ సామాజిక కార్యకర్త, రచయిత, అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు.

వీడియోలో రేణు దేశాయ్ తెల్లచీరలో కనిపించే మరో ఇద్దరు మహిళా కార్యకర్తలతో కలిసి రోడ్డుపై నడుస్తూ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. జివి ప్రకాష్ కుమార్ బిజిఎమ్ పాత్రను మరింత ఎలివేట్ చేసింది. ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఆర్‌ మదీ ఐఎస్‌సి సినిమాటోగ్రాఫర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. మయాంక్ సింఘానియా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా మాటలు అందిస్తున్నారు.