Site icon HashtagU Telugu

Tollywood: టాలీవుడ్ విషాదం.. ప్రముఖ రచయిత కన్నుమూత.?

Tollywood

Tollywood

తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ అనువాద మాటల రచయిత శ్రీ రామకృష్ణ కన్నుమూశారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తాజాగా చెన్నైలో కన్నుమూసినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే మరికొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు.

ఇకపోతే ఆయన కెరియర్ విషయానికి వస్తే.. శ్రీ రామకృష్ణ కెరీర్​లో దాదాపుగా 300 కు పైగా సినిమాలకు అనువాద రచయితగా పని చేశారు. వాటిల్లో జెంటిల్మెన్, చంద్రముఖి వంటి హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. కాగా, రామకృష్ణ చివరగా రజనీకాంత్‌ సినిమా దర్బార్‌ కు డైలాగ్స్‌ రాశారు. ఆయన స్వస్థలం తెనాలి. గాయకుడు మనోను రజనీకాంత్‌కు పరిచయం చేసింది కూడా ఈయనే. మనో రజనీకాంత్‌ నటించిన పలు చిత్రాలకు తెలుగు డబ్బింగ్‌ కూడా చెప్పారు. 74 ఏళ్ళ వయసులో ఆరోగ్య సమస్యలతో శ్రీ రామకృష్ణ మరణించారు.

ఆయన రచయితగానే కాక పలు సినిమాలకు డైరెక్షన్ కూడా చేసారు. నేడు చెన్నై సాలిగ్రామంలోని స్మశాన వాటికలో శ్రీ రామకృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుమారుడు తెలిపారు. కాగా మరణంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా శ్రీ రామకృష్ణ ఆయన సొంత ఊరు తెనాలి కాగా 50 సంవత్సరాల క్రితమే చెన్నైలో స్థిరపడిపోయారు. రామ కృష్ణ గారు ఎంఏ పట్టాదారులు. ఆయన భార్య పేరు స్వాతి, కుమారుడు గౌతమ్.