Mahesh Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళిల కాంబోలో రానున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ (Mahesh Varanasi) గ్రాండ్ ఈవెంట్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో (RFC) ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతోంది. టైటిల్ అనుకోకుండా లీక్ అయినప్పటికీ.. ఈవెంట్ ముఖ్య ప్రకటనలు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.
సమ్మర్ 2027లో ‘వారణాసి’
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ సినిమా విడుదల తేదీ గురించి కీలక ప్రకటన చేశారు. “మహేష్ బాబు గారితో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభూతి. ఈ సినిమా కోసం మేము ఎంత శ్రమిస్తున్నామో అభిమానులకు వేసవి 2027లో తెలుస్తుంది. ఆ వేసవి నుంచి మహేష్ బాబు అభిమానుల హృదయాల్లో నాకు శాశ్వత స్థానం దక్కుతుందని ఆశిస్తున్నాను” అని కీరవాణి ప్రకటించారు. దీనితో రాజమౌళి- మహేష్ బాబుల అద్భుత సృష్టి 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోందని స్పష్టమైంది.
Why keeravani is special #Varanasi
Dialogues tho చెప్పాడు🔥🔥❤️ #GlobeTrotter #GlobeTrotterEvent pic.twitter.com/oggBLosAZ9
— AitheyEnti (@AitheyEntii) November 15, 2025
Also Read: Ravindra Jadeja: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. కపిల్ దేవ్ తర్వాత మనోడే!
పృథ్వీరాజ్ క్యారెక్టరైజేషన్ సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్
కీరవాణి మాటల్లోనే కాక తన సంగీతంతోనూ అభిమానులను అలరించారు. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర స్వభావాన్ని (క్యారెక్టరైజేషన్) వివరిస్తూ కీరవాణి, ఆయన బృందం వేదికపై ప్రత్యక్షంగా ఒక పాటను ప్రదర్శించారు. ఈ లైవ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ అక్కడి అభిమానులకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ పాత్ర ఎంత కీలకంగా ఉండబోతోందో ఈ పాట స్పష్టం చేసింది.
గ్లోబల్ తారాగణం
రాజమౌళి ఈ గ్లోబ్-ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌ను సీనియర్ నిర్మాత కె.ఎల్. నారాయణ (దుర్గ ఆర్ట్స్ బ్యానర్)తో కలిసి నిర్మిస్తూ తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అగ్ర తారలు భాగం కావడం ఈ సినిమా గ్లోబల్ అప్పీల్‌ను తెలియజేస్తోంది.
