Site icon HashtagU Telugu

Salaar Trailer: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సలార్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!

Salaar Trailer

Resizeimagesize (1280 X 720) (2)

Salaar Trailer: ‘సలార్’ టీజర్‌కు అదిరే రెస్పాన్స్ వస్తుండటంతో మూవీ యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ నోటు రిలీజ్ చేసింది. ‘సలార్’ టీజర్‌పై ప్రేక్షకులు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాకుండా ఆగస్టు నెలను మార్క్ చేసి పెట్టుకోండని సలార్ ట్రైలర్ (Salaar Trailer) అప్డేట్ ఇచ్చింది. భారతీయ సినిమా వైభవాన్ని చాటిచెప్పే అత్యంత ఆసక్తికరమైన ట్రైలర్‌ మీ కోసం వస్తోందంటూ రాసుకొచ్చింది.

వరుస సినిమాలను లైన్ లో పెట్టేసిన ప్రభాస్ ప్రస్తుతం సలార్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ అనుకున్న మేర సక్సెస్ కాకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలు ఈ సలార్ పైనే ఉన్నాయి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా వదిలిన సలార్ టీజర్ సోషల్ మీడియా దుమ్ముదులుపుతోంది. జూలై 7న 5.12 నిమిషాలకు రిలీజ్ చేసిన ఈ టీజర్ విడుదలైన నుంచే భారీ స్థాయిలో వ్యూస్ రాబడుతూ కనీవినీ ఎరుగని కొత్త రికార్డులు నమోదు చేసింది. విడుద‌లైన 24 గంట‌ల్లోనే 83 మిలియ‌న్ వ్యూస్‌ రాబట్టిన ఈ టీజర్ భారీ లైక్స్‌ దక్కించుకుంది. తొలి 24 గంట‌ల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన తెలుగు టీజర్ గా సలార్ రికార్డు నమోదు చేసింది.

Also Read: Threads: దూసుకుపోతున్న థ్రెడ్‌.. 24 గంటల్లోనే అత్యధిక డౌన్ లోడ్ లు..!

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున ఈ సలార్ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సలార్ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకున్న సమయానికే సలార్ రిలీజ్ కానుండటం పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version