Regina : పెళ్లి పీటలు ఎక్కబోతున్న రెజీనా..?

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 02:25 PM IST

చిత్రసీమలో మొన్నటి వరకు బ్యాచలర్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన నటి నటులంతా ఇప్పుడు పెళ్లి చేసుకొని ఓ ఇంటివారు కావాలని చూస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు , హీరోయిన్స్ పెళ్లి చేసుకోగా..తాజాగా వరలక్షి శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar)..ముంబయికి చెందిన ఒక వ్యాపారవేత్త నిక్లాయ్ సచ్‌దేవ్​తో మార్చి 1నే సైలెంట్​గా నిశ్చితార్థం జరుపుకోగా..ఇప్పుడు హీరోయిన్ రెజీనా (Regina ) సైతం పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది.

We’re now on WhatsApp. Click to Join.

మోడలింగ్​తో కెరీర్ మొదలుపెట్టిన రెజీనా..ఆ తర్వాత హీరోయిన్​గా మారిపోయింది. 2012లో శివ మనసులో శృతి అనే చిత్రంతో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత కొత్తజంట, పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, రొటీన్ లవ్ స్టోరీ వంటి చిత్రాలతో విజయాలను అందుకుంది. అలా వరుస సినిమాలు చేస్తూ మంచి యూత్​లో మంచి క్రేజ్ దక్కించుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్​గా ఉంటూ అందాల ఆరబోత తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. ఇదే క్రమంలో సాయి తేజ్ , సందీప్ కిషన్ తో రిలేషన్​షిప్​లో ఉందంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కానీ వాటిలో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. ఇటీవల అవకాశాలు తగ్గడం తో పెళ్లి చేసుకొని సెటిల్ కావాలని ఫిక్స్ అయ్యింది.

ఓ బిజినెస్ మ్యాన్​ను పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. దసరాలోపు రెజీనా పెళ్లి జరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

Read Also : Vastu Tips: ఇంట్లో చీమలు కనిపించడం అశుభమా.. ఏ దిశలో కనిపిస్తే అదృష్టమో తెలుసా?