Site icon HashtagU Telugu

Actress Smoking : దమ్ము మీద దమ్ము కొడుతున్న ప్రభాస్ హీరోయిన్..?

Kruthi Smoke

Kruthi Smoke

ఇటీవల సిగిరెట్ (Smoking) తాగడం చాల కామన్ ..ఆడ, మగ , చిన్న , పెద్ద ఇలా ఎవరు పడితే వారు..ఎక్కడ పడితే అక్కడ దమ్ము మీద దమ్ము కొడుతూనే ఉన్నారు. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని తాగే వాటి ఫై రాసి ఉన్న..అలాగే తాగుతున్నారు. సామాన్య జనాలు సిగిరెట్ మీద సిగిరెట్ ..రోజుకు రెండు పెట్టెల సిగిరెట్స్ తాగిన పెద్దగా ఎవ్వరు పట్టించుకోరు కానీ సినిమా సెట్స్ లో కానీ బయట ఎక్కడైనా హీరో , హీరోయిన్స్ సిగిరెట్ తాగితే మాత్రం ఇదేదో పెద్ద తప్పు చేసినట్లు అంత మాట్లాడుకుంటారు..ప్రచారం చేస్తారు. తాజాగా ప్రభాస్ (Prabhas) హీరోయిన్ సిగిరెట్ తాగడం ఇప్పుడు మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి కృతి సనన్ (Kriti Sanon)..తాజాగా సిగిరెట్ తాగుతూ కనిపించింది.అంతే ఇప్పుడు అంత ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. తెలుగు లో ఫస్ట్ మూవీ నే సూపర్ స్టార్ మహేష్ పక్కన జోడి కట్టి ఆకట్టుకున్న ఈ భామ..ఆ తర్వాత నాగ చైతన్య సరసన దోచేయ్ సినిమాలో అలరించింది. కానీ, ఈ రెండు సినిమల్లో కృతి నటనకు మంచి మార్కులు పడినా.. సినిమాలు సక్సెస్ కాకపోవడం తో అమ్మడికి అవకాశాలు తలుపుతట్టలేదు. దీంతో బాలీవుడ్ కు మకాం మార్చింది. ఇక అక్కడే బ్యాక్ బ్యాక్ సినిమాలు చేస్తూ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఎదిగింది. ఈ మధ్యనే ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

జులై 27 న ఈ భామ పుట్టిన రోజు..ఈ సందర్బంగా బర్త్ డే వేడుకలు గ్రీస్ లో చేసుకుంది. అయితే అక్కడ ఈ భామ కు సంబదించిన వీడియో బయటకు వచ్చింది. ఇక ఆ వీడియో చివర్లో ఓ యువతి సిగరెట్ తాగుతూ కనిపిస్తుంది. అయితే ఆ వీడియోలో యువతి ముఖం సరిగ్గా కనిపించడం లేదు. ఇక ఇప్పుడు ఆ వీడియోలో ఉన్నది కృతిసనన్ అని నెట్టింట అందరూ విమర్శిస్తున్నారు. కాగా, ఆ వీడియోను ఓ రెడిట్ యూజర్ పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి నిజంగా కృతి సిగిరెట్ తగ్గిందో లేదో ఆమెనే క్లారిటీ ఇవ్వాలి.

Read Also : Prithvi Shaw: రాణిస్తున్న పృథ్వీ షా, పట్టించుకోని బీసీసీఐ