200 Cr for Pathaan?: రిలీజ్ కు ముందే రికార్డులు.. పఠాన్‌కు 200 కోట్ల ఓపెనింగ్?

పఠాన్ ఈ నెల 26న విడుదల కానుంది. ఈ చిత్రం ఇప్పటికే ముందస్తు బుకింగ్స్ లో రికార్డులను తిరుగరాస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Pathaan

Pathaan

ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటేనే బాలీవుడ్ మాత్రమే. మరి అలాంటి బాలీవుడ్ (Bollywood)  సరైన హిట్స్ సౌత్ వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న షారుఖ్ (Shah Rukh Khan) సినిమాపైనే జనాలు ఆశలు పెట్టుకున్నారు. ప్రేక్షకుల అంచనాల మాదిరిగానే పఠాన్ మూవీ రిలీజ్ కు ముందే హైప్ క్రియేట్ చేస్తోంది. పఠాన్ ఈ నెల 26న విడుదల కానుంది. ఈ చిత్రం ఇప్పటికే ముందస్తు బుకింగ్స్ లో రికార్డులను తిరుగరాస్తోంది.

ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. పఠాన్ (Pathaan) చిత్రం 5 రోజుల వీకెండ్‌లో రూ. 200 కోట్ల నెట్ ఓపెనింగ్‌ను రాబట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే భారతదేశంలో ఒక హిందీ చిత్రానికి అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలువనుంది. సినిమా కు పాజిటివ్ బజ్‌తో రావడంతో పఠాన్ కు ఊహించనివిధంగా రెస్పాన్స్ వస్తోంది. రూ. 200 కోట్లు కేవలం వీక్ డేస్ లోనే సాధించే అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఐతే రిలీజ్ ముంగిట ప్రమోషన్ల హడావుడి తప్పదని ఒక పాట రిలీజ్ చేస్తే దాని మీద పెద్ద వివాదమే నడిచింది. దెబ్బకు షారుఖ్ (Shah Rukh Khan) మళ్లీ సైలెంట్ అయిపోయాడు. మరోవైపు షారుఖ్ (Shah Rukh Khan) అభిమానులతో పాటు యాక్షన్ ప్రియులను ట్రైలర్ బాగా ఆకట్టుకుంది. దీపికా బికినీ సాంగ్ కూడా హైలైట్ గా మారడంతో పఠాన్ క్రేజ్ దేశవ్యాప్తంగా పాకింది.

అడ్వాన్స్ బుకింగ్స్ (Advance bookings) మొదలవడం ఆలస్యం.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. నాలుగు రోజుల వ్యవధిలో పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలిస్ మల్లీప్లెక్స్ ఛైన్స్ దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల టికెట్లు (Tickets) అమ్మేయడం విశేషం. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.15 కోట్ల దాకా వసూళ్లను రాబట్టేసిందట ‘పఠాన్’. ఇక రిలీజ్ ముందు రోజు వరకు జరిగే ప్రి సేల్స్, తొలి రోజు బుకింగ్స్ కలుపుకుంటే ఈజీగా రూ. 50 కోట్ల మార్కును ‘పఠాన్’ టచ్ చేసేలా కనిపిస్తోంది.

Also Read: Vijay Deverakonda: వాలీబాల్ టీమ్ కు యజమానిగా మారిన విజయ్‌ దేవరకొండ

  Last Updated: 24 Jan 2023, 11:56 AM IST