Prabhas Kalki : ప్రభాస్ కల్కి మేనియా.. మహేష్ AMB మల్టీప్లెక్స్ లో ఎన్నిషోలు వేస్తున్నారో తెలుసా..?

Prabhas Kalki ప్రస్తుతం తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సరే కల్కి మేనియా కనబడుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 500 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిన కల్కి సినిమా

Published By: HashtagU Telugu Desk
Kalki 2898 AD OTT Release Date

Kalki 2898 AD OTT Release Date

Prabhas Kalki ప్రస్తుతం తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సరే కల్కి మేనియా కనబడుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 500 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిన కల్కి సినిమా విజువల్ వండర్ గా తెరకెక్కుతుంది. రిలీజ్ కి మరో 3 రోజులు మాత్రమే ఉన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ హంగామా మొదలైంది. రిలీజైన ప్రచార చిత్రాలు కూడా సినిమాపై భారీ హైప్ తీసుకు రాగా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.

ఇక సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో అయితే కల్కి రిలీజ్ రోజు దాదాపు అన్ని థియేటర్లలో కల్కినే ఆడుతుందని టాక్. హైదరాబాద్ లో మాత్రం సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ అన్నిట్లో కూడా కల్కి ఆడుతుంది. ఇక మహేష్ ఏ.ఎం.బి థియేటర్ లో కల్కి కోసం ఏకంగా 40 షోలు ఏర్పాటు చేశారని తెలుస్తుంది.

ఇదివరకు ఏ సినిమాకు కూడా ఇన్ని షోస్ వేయలేదు. ప్రభాస్ కల్కి కోసం ఏ.ఎం.బి టీం ఏకంగా 40 షోస్ వేయాలని నిర్ణయించారు. దానికి తగిన టైమింగ్స్ కూడా సిద్ధం చేశారు. తెలుగు సినిమాకు ఏ సినిమాకు ఈ రేంజ్ లో భారీ షోలు వేయలేదు. మహేష్ ఏ.ఎం.బిలో మాత్రమే కాదు కల్కి కోసం ప్రభాస్ ఐమాక్స్ లో కూడా 32 షోస్ వేస్తున్నారట. మొత్తానికి కల్కి సినిమాతో మరోసారి థియేటర్లు అన్ని కళకళలాడుతాయని చెప్పొచ్చు.

  Last Updated: 24 Jun 2024, 12:38 PM IST