Site icon HashtagU Telugu

Prabhas Fans Attack on South Korean Actor : సౌత్ కొరియన్ యాక్టర్ ఇన్ స్టాగ్రామ్ మీద రెబల్ ఫ్యాన్స్ ఎటాక్..!

Prabhas

Prabhas

ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) డైరెక్షన్ లో స్పిరిట్ (Spirit Movie) సినిమా చేస్తాడని తెలిసిందే. ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ (Raja Saab) సినిమాను పూర్తి చేశాక స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్తుంది. ఐతే సందీప్ వంగ ఈ సినిమాలో ప్రభాస్ కి విలన్ గా సౌత్ కొరియ యాక్టర్ మా డాంగ్ సియోక్ ని ఎంపిక చేశాడని వార్తలు వచ్చాయి. ఐతే ఈ వార్తల్లో నిజం ఎంత అన్నది తెలియదు కానీ డా మాన్ సియోక్ పేరు తెలియగానే అతని కోసం వెంటనే వెతికి అతన్ని ఫాలో అవ్వడం మొదలు పెట్టారు రెబల్ స్టార్ ఫ్యాన్స్ (Rebal Star Fans).

అంతేకాదు అతను రీసెంట్ గా షేర్ చేసిన ఇన్ స్టాగ్రాం పోస్ట్ కి వేల కొద్దీ రెబల్ స్టార్ ఫ్యాన్స్ మెసేజ్ లు చేస్తున్నారు. ఆయన పోస్ట్ లకు లైకులు విపరీతమైన షేర్లు జరుగుతున్నాయి. ఇదంతా ప్రభాస్ సినిమా ప్రభావమే అని చెప్పొచ్చు. సౌత్ కొరియన్ లో దాదాపు ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు మా డాంగ్ సియోక్.

సందీప్ రెడ్డి ప్రభాస్ స్పిరిట్ సినిమాలో మా డాంగ్ సియోక్ నటిస్తున్నాడని తెలియగానే అతని మీద రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎటాక్ మొదలు పెట్టారు. అంతేకాదు అతను చేస్తున్న సోషల్ మీడియా పోస్ట్ ల మీద కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి మా డాంగ్ సియోక్ (Ma Dong Seok) నిజంగానే ప్రభాస్ సినిమాలో నటిస్తున్నాడా లేదా అన్నది చూడాలి.

కల్కి తో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ రాబోతున్న సినిమాల మీద కూడా భారీ ఇంపాక్ట్ కలిగేలా చేయాలని చూస్తున్నాడు. కల్కి వల్ల నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న రాజా సాబ్ బిజినెస్ అయితే ఒక రేంజ్ లో జరుగుతుందని తెలుస్తుంది. కల్కి 2 సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అంటున్నారు. సో వరుస వెంట రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే లెక్క.