Pavithranath Death : మొగలి రేకులు ఫేమ్ పవిత్రనాథ్ మృతికి కారణాలివే..!!

మొగలిరేకులు ఫేమ్ (Mogali Rekulu Fame) పవిత్రనాథ్ (Pavithra Nath) కన్నుమూయడం తెలుగు బుల్లితెర పరిశ్రమలో విషాదం నెలకొంది. మొగలిరేకులు సీరియల్ లో దయ క్యారెక్టర్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన పవిత్రనాథ్ .. చక్రవాకం, మొగలిరేకులు, కృష్ణ తులిసి.. ఇలా ఎన్నో సీరియల్స్ తో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. పవిత్రనాథ్ చిన్న వయసులోనే మరణించడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. పవిత్రనాథ్ మరణించిన విషయాన్ని సీరియల్ నటుడు ఇంద్రనీల్, అతని భార్య మేఘన […]

Published By: HashtagU Telugu Desk
Pavitranadh

Pavitranadh

మొగలిరేకులు ఫేమ్ (Mogali Rekulu Fame) పవిత్రనాథ్ (Pavithra Nath) కన్నుమూయడం తెలుగు బుల్లితెర పరిశ్రమలో విషాదం నెలకొంది. మొగలిరేకులు సీరియల్ లో దయ క్యారెక్టర్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన పవిత్రనాథ్ .. చక్రవాకం, మొగలిరేకులు, కృష్ణ తులిసి.. ఇలా ఎన్నో సీరియల్స్ తో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. పవిత్రనాథ్ చిన్న వయసులోనే మరణించడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. పవిత్రనాథ్ మరణించిన విషయాన్ని సీరియల్ నటుడు ఇంద్రనీల్, అతని భార్య మేఘన సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. కానీ ఎలా మరణించాడనేది తెలుపకపోయేసరికి అసలు ఏమై ఉంటుందా అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

పవిత్రనాథ్ కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే అతడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని.. మానసికంగా చాలా కుంగిపోయాడని అతడి సన్నిహితులు చెప్తున్నారు. ఆరేళ్ల క్రితం అతడికి హార్ట్ ఎటాక్ వచ్చిందని.. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని… అదే సమయంలో వ్యక్తిగత జీవితంలో ఎదురైన పరిస్థితులు అతడిని మానసికంగా ఒత్తిడికి గురిచేశాయి. కొన్నాళ్లుగా తీవ్ర మనోవేదనతోపాటు.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పవిత్రనాథ్.. ఆరోగ్యం క్షీణించడంతోనే మరణించాడని అంటున్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం.. పవిత్రనాథ్ భార్య శశిరేఖ అతనిపై తీవ్ర ఆరోపణలు చేసింది. 2009లో పవిత్రనాథ్, శిశిరేఖలు వివాహం కాగా.. వీరికి 13 ఏళ్ల పాప.. పదేళ్ల బాబు ఉన్నారు. అయితే గత 11 ఏళ్లుగా తనకి నరకం చూపిస్తున్నాడని పవిత్రనాథ్‌పై ఆరోపణలు చేసింది శశిరేఖ. అతనికి అమ్మాయిల పిచ్చి ఉందని.. చాలామంది అమ్మాయిలను ఇంటికి తీసుకుని వచ్చేవాడని.. తనని తీవ్రంగా కొట్టేవాడంటూ పిల్లల్ని కూడా సరిగా చూడటం లేదని ఆరోపించింది శిశిరేఖ. ఇలా అప్పటి నుండే దయ ఒంటరిగా కుమిలిపోతూ …ఇప్పుడు ఏకంగా తనువు చాలించాడు.

Read Also : Prabhas : నీటిపై ముగ్గుతో ప్రభాస్ ఫోటో వేసిన అభిమానం చాటుకున్న యువతీ..

  Last Updated: 03 Mar 2024, 06:21 PM IST