టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) మీద ఆయన స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాస్ రావు (Uppalapati Srinivas Rao) చేసిన ఆరోపణలు ప్రస్తుతం సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 1990 నుండి తమ మధ్య ఉన్న స్నేహాన్ని ప్రస్తావిస్తూ తన జీవితాన్ని రాజమౌళి కోసం త్యాగం చేశానని, కానీ ఇప్పుడు రాజమౌళి వల్లే తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నానని శ్రీనివాస్ రావు లేఖలో పేర్కొన్నారు. తాను చనిపోతే ఆ బాధ్యత రాజమౌళిదేనని చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లేఖతో పాటు ఓ వీడియో కూడా బయటకు రావడంతో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠను రేపుతోంది.
రాజమౌళి విజయాలకు అసలు కారణం క్షుద్ర పూజలా?
తన వాంగ్మూలంలో యమదొంగ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తన పేరును చేర్చారని, తన పాత్రను అంతటా మర్చిపోయారని, పైగా రాజమౌళి విజయాలకు అసలు కారణం క్షుద్ర పూజలు (Kshudra Poojalu) అనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సినిమాలు విజయం సాధించడానికి ఆలౌకిక శక్తులను ఉపయోగిస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు నిజానిజాలు తెలియని స్థితిలో ఉండటంతో, శ్రీనివాస్ రావు నిజంగా మానసిక ఒత్తిడిలో ఉన్నారా? లేక కావాలని రాజమౌళిని టార్గెట్ చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆరోపణలపై అనుమానాలు – నిజమా? కుట్రా?
శ్రీనివాస్ రావు చేసిన ఆరోపణలలో చాలావరకు ఆధారాలు లేనివే కావడంతో, ఇది ఒక వ్యక్తిగత కక్ష లేదా బాధతో చేసిన ఆరోపణ అని భావిస్తున్నారు. ఒక టాలీవుడ్ దిగ్గజ దర్శకుడిపై ఇలాంటి విమర్శలు రావడం ఇదే మొదటిసారి కావడంతో సినీ పరిశ్రమ మొత్తం ఈ వ్యవహారాన్ని ఆసక్తిగా గమనిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీసుల విచారణలో ఉండగా, రాజమౌళి ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. కానీ, సోషల్ మీడియాలో ఈ లేఖ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది నిజమా? లేక ఇంకెవరో రాజమౌళిపై కుట్ర చేస్తున్నారా? అనే విషయాన్ని త్వరలోనే పోలీసులు వెలుగులోకి తీసుకురానున్నారు.
వివాదంలో స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి జక్కన్న పై సంచలన ఆరోపణలు చేసిన ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు రాజమౌళి టార్చర్ భరించలేని ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో, లెటర్ రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందన్న శ్రీనివాసరావు #SSrajamouli #Tollywood #HashtagU pic.twitter.com/i0kaH5qQgG
— Hashtag U (@HashtaguIn) February 27, 2025