Site icon HashtagU Telugu

Manjummel Boys : మీకు తెలుసా.. ‘మంజుమ్మల్ బాయ్స్’లో రియల్ లైఫ్ గ్యాంగ్ కూడా నటించింది..

Real Life Manjummel Boys Are Also Acted In Movie

Real Life Manjummel Boys Are Also Acted In Movie

Manjummel Boys : మలయాళ సినిమాలు కంటెంట్ తో ఆడియన్స్ ని ఎప్పుడు ఆకర్షిస్తుంటాయి. పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయిన తరువాత మలయాళ సినిమాలు మరింత ప్రేక్షకాదరణ అందుకుంటున్నాయి. అలా విశేషమైన ప్రేక్షకాదరణ అందుకున్న సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్’. 2006లో జరిగిన ఒక రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం అందరికి తెలిసిందే.

కేరళలోని కోచి ప్రాంతానికి చెందిన ‘మంజుమ్మల్ బాయ్స్’ అనే ఒక ఫ్రెండ్స్ గ్రూప్.. తమిళనాడులోని కొడైకెనాల్ లో ఉన్న గుణ కేవ్స్ కి వెకేషన్ వెళ్లారు. ఆ సమయంలో తమలోని ఒక మిత్రుడు అనుకోకుండా గుహలో ఉన్న ఒక హోల్ ద్వారా లోయలో పడిపోతాడు. ఇక ఆ లోయలో పడిపోయిన మిత్రుడిని కాపాడు కోసం.. ఆ స్నేహితులు చేసిన సాహసం అందరికి స్ఫూర్తిని ఇచ్చేలా ఉంటుంది.

ఆ స్నేహితులు చేసిన సాహసానికి రాష్ట్ర మరియు సెంట్రల్ గవర్నమెంట్స్ సైతం మెడల్స్ ఇచ్చి సత్కరించాయి. అయితే అప్పటిలో ఈ సాహసం గురించి పెద్దగా ఎవరికి తెలియలేదు. కానీ మంజుమ్మల్ బాయ్స్ సినిమా వచ్చిన తరువాత.. ఆ రియల్ లైఫ్ ఫ్రెండ్స్ ఎవరు అని తెలుసుకోవడానికి అందరూ క్యూరియాసిటీ చూపించారు. ఇక ఈ ఆసక్తి గమనించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అండ్ మీడియా.. రియల్ లైఫ్ ఫ్రెండ్స్ తోనే ఇంటర్వ్యూలు కూడా చేసారు.

అయితే ఆడియన్స్ కి తెలియని విషయం ఏంటంటే.. రియల్ లైఫ్ ఫ్రెండ్స్ ఈ సినిమాలో కూడా యాక్ట్ చేసారు. సినిమా స్టార్టింగ్ లో ఒక పెళ్లి ఫంక్షన్ జరుగుతుంటుంది. ఆ పెళ్లిలో మంజుమ్మల్ బాయ్స్ గొడవ పడి.. మరో గ్యాంగ్ తో తాడు పోటీకి వెళ్తారు. ఆ పోటీలో రీల్ లైఫ్ మంజుమ్మల్ బాయ్స్.. రియల్ లైఫ్ మంజుమ్మల్ బాయ్స్ తో పోటీ పడతారు. ఈ విషయం చాలామందికి తెలియదు.