Site icon HashtagU Telugu

Bhumika Chawla: యంగ్ హీరోలతో రొమాన్స్ చేసేందుకు నేను రెడీ: భూమిక చావ్లా

Bhumika

Bhumika

పవన్ కళ్యాణ్, భూమిక చావ్లా (Bhumika Chawla) నటించిన 2002 కల్ట్-హిట్ చిత్రం ఖుషీ (Kushi) ఇప్పటికీ ఆకట్టుకుంటోంది. రెండు దశాబ్దాల తర్వాత కూడా భూమిక అంతే సెక్సీగా, ఆకర్షణీయంగా ఉంది.  40 ఏళ్ల వయసులో ఈ బ్యూటీ 20 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. ఇటీవల భూమిక చావ్లా ఇటీవల విడుదలైన తన చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ కోసం ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు, కానీ నటీనటులతో ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి,

‘‘మలైకా అరోరా, అర్జున్ కపూర్ లేదా ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ రిలేషన్ గురించి అందిరి తెలిసిందే. ఈ జంటల మధ్య వయసులో వ్యత్యాసం ఉన్నప్పటికీ హిట్ పెయిర్ అనిపించుకుంటున్నారు. ఒక పురుషుడు చేయగలిగితే, స్త్రీ కూడా చేయగలదు. ఒక హీరో తన వయసులో సగం మందితో రొమాన్స్ (Romance) చేస్తుంటే, నేను కూడా చేయగలను. రొమాన్స్ చేయడంలో తప్పేముంది’’ అని అంటోంది. సీనియర్ నటీనటులు ప్రధాన పాత్రలను పొందుతున్న వెబ్ సిరీస్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మారుతున్నాయి. కానీ కమర్షియల్ సినిమాల్లో మాత్రం మార్పు రావాల్సి ఉంది. హీరో ఇప్పటికీ హీరోగా నటిస్తున్నాడు. కానీ హీరోయిన్స్ మాత్రం వెనకడుగు వేయాల్సి వస్తోంది అని చెప్పింది భూమిక.

భూమి నటించిన ‘అనసూయ’, ‘అమరావతి’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించగా, ‘ఏప్రిల్‌ ఫూల్‌’, ‘సత్యబామ’ ఫర్వాలేదు. భూమిక (Bhumika Chawla) పడచు కుర్రాలతో రొమాన్స్ చేసేందుకు రెడీగా ఉన్నానని స్టేట్ మెంట్ ఇవ్వడంతో టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయో, రావో వేచిచూడాల్సిందే.

Also Read: Ram Charan: ఆసక్తి రేపుతున్న RC16, బాడీ బిల్డర్‌ పాత్రలో రామ్ చరణ్?