Site icon HashtagU Telugu

August : ఈ నెల మొత్తం రీ రిలీజ్ ల పండగే..!!

Aug Re Release Movies

Aug Re Release Movies

టాలీవుడ్ (Tollywood) బాక్స్ ఆఫీస్ (Box Office) వద్ద సరైన సినిమాలు పడడమే లేదు. చిన్న చితక హీరోల సినిమాలు వస్తున్నప్పటికీ..మధ్య మధ్య లో పెద్ద హీరోలు వచ్చినప్పటికీ ప్రేక్షకులను మాత్రం సంతృప్తి పరచడం లేదు. ఈ క్రమంలో నిర్మాతలు రీ రిలీజ్ ల ట్రెండ్ ను మొదలుపెట్టారు. అగ్ర హీరోల చిత్రాలే కాదు సూపర్ హిట్ అయినా గత చిత్రాలను మళ్లీ సరికొత్త టెక్నలాజి తో రిలీజ్ చేస్తూ అలరిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

చిరంజీవి , బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , ప్రభాస్, అల్లు అర్జున్ , రామ్ చరణ్ , నాగార్జున , రవితేజ ఇలా చాలామంది హీరోలు నటించిన గత చిత్రాలను వారి వారి బర్త్డే లకు రీ రిలీజ్ చేస్తూ అలరిస్తున్నారు. ఈరోజు నాని నటించిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ రీ రిలీజ్ అయ్యింది. ఈరోజు మాత్రమే కాదు ఈ నెల అంత కూడా చాల సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. ఆగస్టు 9న మహేశ్ బాబు నటించిన ‘మురారి’, 8న ‘ఒక్కడు’, 22న చిరంజీవి ‘ఇంద్ర’, 28న నాగార్జున ‘మాస్’, 29న ‘శివ’ చిత్రాలు రీరిలీజ్ కానున్నాయి. మరికొన్ని సినిమాలు కూడా రీరిలీజ్ అవుతాయని తెలుస్తోంది.

Read Also : Kangana On Rahul: రాహుల్ అర్ధం లేని మాటలు: కంగనా