Site icon HashtagU Telugu

RC16 Movie : మైసూరులో RC16 షూటింగ్ స్టార్ట్

Rc16

Rc16

ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ (Ram CHaran)..ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా మూవీస్ తో అలరించేందుకు సిద్ధం అయ్యాడు. శంకర్ డైరెక్షన్లో ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్లో గేమ్ చెంజర్ (Game Changer) మూవీ పూర్తి చేసాడు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా..సినిమా పై మరింత అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు ప్రమోషన్స్ జరుపుతున్నారు.

ఇది రిలీజ్ కు సిద్ధంగా ఉండగానే..చరణ్ తన 16 వ చిత్ర షూటింగ్ మొదలుపెట్టారు. ఉప్పెన చిత్రంతో మెగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు (Buchhibabu)..ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈరోజు మైసూర్ లో మొదలైంది. ఈ సందర్భంగా బుచ్చిబాబు మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ‘ఇది ఎంతో ముఖ్యమైన రోజు. ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, చరణ్ కూడా ఇప్పటికే మైసూరుకు చేరుకోవడం జరిగింది.

మైసూర్‌లోని కొన్ని పురాతన భవనాలు.. మైసూరు శివార్లలోని అటవీ ప్రాంతాల్లో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది.ఈ షెడ్యూల్లో రామ్ చరణ్‌, జాన్వీ కపూర్‌తో పాటు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ కూడా పాల్గొనబోతున్నారట. ఇక రెండు వారాల పాటు జరిగే ఈ షెడ్యూల్‌ తర్వాత.. మరో షెడ్యూల్‌ ను ప్లాన్ భారీగా ప్లాన్ చేయనున్నారట డైరెక్టర్ బుచ్చిబాబు. ఉత్తరాంధ్ర నేపథ్యంలోని కథతో సినిమా రూపొందుతోంది.

ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకం మీద వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ‘రంగస్థలం’ తర్వాత మరోసారి రామ్ చరణ్ చిత్రానికి రత్న వేలు ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

Read Also : WhatsApp : వావ్‌.. వాట్సాప్‌ కొత్త ఫీచర్‌.. వాయిస్‌ మెసేజ్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌