Site icon HashtagU Telugu

RC16 ఆమె ఫిక్స్.. రెమ్యునరేషన్ కూడా లీక్..!

Rc16 Heroine Fix Remuneration Leaked

Rc16 Heroine Fix Remuneration Leaked

RC16 RRR తర్వాత రాం చరణ్ గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఆచార్య సినిమా చేసిన చరణ్ ఆ సినిమా తో డిజాస్టర్ ఫేస్ చేశాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేం చేంజర్ సినిమా చేస్తున్నాడు రాం చరణ్. ఆ సినిమా పూర్తి కాగానే బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ దేవర తో జాన్వి కపూర్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుండగా చరణ్ సినిమాను కూడా అమ్మడు ఓకే చేసిందట. ఈ విషయాన్ని బోనీ కపూర్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ మూవీని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

చరణ్ బుచ్చి బాబు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో జాన్వి కపూర్ తో పాటుగా అలియా భట్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. జాన్వి కపూర్, అలియా భట్ ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. మొత్తానికి బాలీవుడ్ అందాల భామలు ఇద్దరు చరణ్ సినిమాలో భాగం అవుతున్నారు. ఆర్సీ 16లో నటించేందుకు గాను జాన్వి కపూర్ 3 కోట్ల దాకా తీసుకుంటున్నారని తెలుస్తుంది.