ప్రముఖ తమిళ చిత్రనిర్మాత శంకర్ దర్శకత్వం వహిస్తున్న RC15 పాన్ ఇండియన్ ఫిల్మ్‌లో మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్ లాంటివాళ్లు నటిస్తుండటంతో అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ఆసక్తిని కలిగిస్తోంది. ఈ స్టార్ కాస్ట్ లో దర్శకుడు, నటుడు ఎస్‌జె సూర్య నటించే అవకాశాలున్నాయి. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారు.
రామ్ చరణ్ నటించిన తారాగణంగా SJ సూర్యకు స్వాగతం పలికారు. అదే విషయాన్ని తెలియజేసేందుకు నిర్మాతలు ట్విట్టర్‌లో పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం RC15 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్‌కి ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవల, రామ్ చరణ్, బృందం ఓ ఉల్లాసమైన పాటను షూట్ చేశారు కూడా. RC15లో ఒక పాట కోసం 1,000 మందికి పైగా డ్యాన్సర్లు రామ్ చరణ్ మరియు కియారా అద్వానీతో కలిసి డ్యాన్స్ చేశారు.
ఈ సినిమాలో స్టూడెంట్, పోలీసు అధికారిగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు టాక్. కైరా అద్వానీ ఈ చిత్రంలో కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అయితే శంకర్ ఒకవైపు భారతీయుడు2 సినిమాను డైరెక్ట్ చేస్తూనే, మరోవైపు రాంచరణ్ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నాడు.