Site icon HashtagU Telugu

Razakar: తెలంగాణ పల్లెలపై జరిగిన ద‌మ‌న‌కాండ నేప‌థ్యంలో ‘రజాకర్’ మూవీ

Razakar

Razakar

ప్రాంతీయ ఉద్యమ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అవన్నీ బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయినా ప్రేక్షకులను మాత్రం రంజింపజేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘రజాకర్’ అనే సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. 1947 ముందు తెలంగాణ గడ్డ పై రజాకార్ల దురగాథల వల్ల తెలంగాణ ప్రజల వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారో, వాటిని ఇతివృత్తాంతంగా రూపొందించిన మూవీనే రజాకర్.

ఈ మూవీ పోస్టర్ లాంచ్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి సినీ ప్రముఖులతో పాటు ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ విద్యసాగర్, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీలు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ మూవీని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పాటలు రాస్తున్నారు.

సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. “రజకర్ లాంటి సినిమా తియ్యాలంటే చాలా గట్స్ ఉండాలి. మా అమ్మ నాన్న ఇద్దరు స్వతంత్ర సమరయోధులే. వారి బిడ్డగా నాకు ఈ సినిమాలో పాటలు రాయడం అదృష్టంగా భావిస్తున్నా. రజాకర్ అంటే కార్యకర్త వలంటీర్ అనే అర్థం వస్తుంది. కానీ రజాకర్ చేసిన దూరగతలు అంతా ఇంతా కాదు. ఇది మతపరమైన సినిమా కాదు. ఏ ఒక్కరికి ఇది వ్యతిరేకమైనది కాదు” అంటూ వ్యాఖ్యానించారు.

హైద‌రాబాద్ నిజాం సంస్థానంలోని ప్రైవేట్ సైన్యం `ర‌జాకార్‌`. తెలంగాణ ప‌ల్లెల్లో దూరి హ‌త్య‌లు, దౌర్జ‌న్యాలు, యువ‌తుల మాన, ప్రాణాల‌ని హ‌రించ‌డం, అందిన కాడికి సొత్తును దోచుకుంటూ అడ్డు వ‌చ్చిన వారిని అతి కిరాత‌కంగా హ‌త మార్చ‌డం వీరి ప‌ని. `ర‌జాకార్‌` సైన్య చేసిన ఆగ‌డాలకు అడ్డూ అదుపూ లేదు. వారి చేసిన దౌర్జ‌న్యాల‌కు లెక్క‌లేదు. అల‌నాడు తెలంగాణ ప‌ల్లెల‌పై నిజాం ర‌జాకార్ మూక చేసిన ద‌మ‌న‌కాండ నేప‌థ్యంలో రూపొందుతున్న సినిమా `ర‌జాకార్‌`. తెలంగాణలో ఎన్నికల సమయంలో ఈ మూవీ విడుదల కాబోతుంది.

Also Read: Mission Bhagiratha: విషాద ఉదంతం, మిషన్ భగీరథ ఉద్యోగిని ఆత్మహత్య