Site icon HashtagU Telugu

Annusriya Tripathi: ఆ హీరో నటన అంటే ఇష్టం.. రజాకార్ మూవీ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

Mixcollage 17 Mar 2024 11 48 Am 1361

Mixcollage 17 Mar 2024 11 48 Am 1361

రజాకార్ మూవీ ఇటీవలే మార్చి 15న విడుదలైన విషయం తెలిసిందే. హైదరాబాద్ నిజాం సంస్థానం భారతదేశంలో ఎలా విలీనమైంది, అప్పట్లో రజాకార్ల అకృత్యాలు ఎలా ఉన్నాయి అనే కథాంశంతో తెరకెక్కింది. కాగా ఈ సినిమాని చాలా ఎమోషన్ తో, దేశభక్తి ఎలివేషన్స్ తో చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. యాట సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కగా రజాకార్ సినిమాలో బాబీ సింహ, అనసూయ, వేదిక, ప్రేమ, ఇంద్రజ, అనుశ్రీ త్రిపాఠి, మకరంద దేశ్ పాండే, తేజ్ సప్రూ, రాజ్ అర్జున్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

కాగా ఈ సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నిజం రాజు భార్యగా నటించిన అనుశ్రీ త్రిపాఠి మీడియాతో ముచ్చటించింది. సినిమా గురించి, తన గురించి పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. నేను బెంగళూరులో చదివేటప్పుడే థియేటర్స్ గ్రూప్ లో నటించేదాన్ని. చదువు అయ్యాక సివిల్స్ కి ప్రైవెట్ర్ అంతు నాకు నటిని కావాలనే కోరిక ఉండటంతో హైదరాబాద్ వచ్చి థియేటర్స్ వర్క్ షాప్స్ చేశాను. ఈ సినిమా ఆడిషన్స్ కి రాగా నిజాం భార్య పాత్రకి నేను సరిపోతానని భావించి అవకాశం ఇచ్చారు. రజాకార్ సినిమాలో నిజాం భార్యగా కనిపించాను. అది సున్నితంగా ఉంటూనే బలంగా ఉండే పాత్ర. ఈ సినిమాలో ఉండే ఏకైక గ్లామర్ రోల్ నాదే.

ఇలాంటి ఒక చరిత్ర చెప్పే సినిమాతో నా కెరీర్ ప్రారంభం అవ్వడం నాకు సంతోషంగా ఉంది. ఈ పాత్ర కోసం మెథడ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. మకరంద్ దేశ్ పాండే గారితో నా లుక్ టెస్ట్ చేసి ఓకే అనుకున్నాకే నాకు అవకాశం ఇచ్చారు అని తెలిపింది అనుశ్రీ. అనంతరం ఇష్టమైన హీరో హీరోయిన్ల గురించి మాట్లాడుతూ.. బాలీవుడ్ లో రణబీర్ కపూర్, టాలీవుడ్ రామ్ చరణ్ ల నటన అంటే చాలా ఇష్టం. రామ్ చరణ్ గారిలో ఇంటెన్స్ ఎమోషన్ ఇష్టపడతాను. హీరోయిన్స్ లో ప్రియాంక చోప్రా, అనుష్క శెట్టి, కీర్తి సురేష్ ఇష్టం. మహానటిలో కీర్తి గారి నటన అద్భుతం. భవిష్యత్ లో అలాంటి మంచి పాత్రలో కనిపించాలని ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చింది అనుశ్రీ.