Site icon HashtagU Telugu

Raviteja Venky : వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఎవరికీ నచ్చలేదట.. డైరెక్టర్ బలవంతంతోనే పెట్టారా..?

Raviteja Venky Movie Train Episod Srinu Vaitla Revealed Backstory About That Scene

Raviteja Venky Movie Train Episod Srinu Vaitla Revealed Backstory About That Scene

Raviteja Venky మాస్ మహరాజ్ రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ మూవీ వెంకీ. 2004 లో రిలీజైన ఈ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి రీసెంట్ ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల చెప్పుకొచ్చారు.

రవితేజ, స్నేహా జంటగా నటించిన వెంకీ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. రవితేజ, బ్రహ్మానందం, ఏవిఎస్, వేణు మాధవ్ ఇలా అందరు కలిసి ఆ ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ అయ్యేలా చేశారు.

వెంకీ సినిమా అనగానే అందరికీ ఆ ట్రైన్ ఎపిసోడ్ గుర్తుకొచ్చేలా చేశారు. అయితే శ్రీను వైట్ల ఆ సీన్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఫస్ట్ ఆ సీన్ ఎవరికీ నచ్చలేదట. అసలు వర్క్ అవుట్ అవుతుందా ఆడియన్స్ ఈ సీన్ ని ఎంజాయ్ చేస్తారా అని యూనిట్ అంతా డౌట్ పడ్డారట. శ్రీను వైట్ల మాత్రం ఆ ఎపిసోడ్ బాగుంటుందని చెప్పి అదే కాన్ ఫిడెంట్ తో సినిమాలో ఉంచారట.

తీరా రిలీజ్ అయ్యాక ఆ సీన్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వెంకీలో ఆ ట్రైన్ ఎపిసోడ్ లాంటి సీన్స్ ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నారు. అలా వెంకీ ట్రైన్ ఎపిసోడ్ ఒక బ్రాండ్ సెట్ చేసింది. యూనిట్ మాటలు విని శ్రీను వైట్ల ఆ సీన్ చేయకుండా ఉంటే మాత్రం ఒక మంచి ఎపిసోడ్ మిస్ అయ్యే వాళ్లం. శ్రీను వైట్ల రవితేజ ఇద్దరి కెరీర్ కి వెంకీ ఒక మంచి బూస్టింగ్ ఇచ్చింది.

Also Read : Jhanvi Kapoor: అందుకే తిరుమల శ్రీవారి పై అంత భక్తి.. ఎట్టకేలకు కారణం రివీల్ చేసిన జాన్వీకపూర్!