Site icon HashtagU Telugu

Raviteja : రవితేజ 100 కోట్ల ‘ధమాకా’ కాంబో మళ్ళీ రానుంది.. హిట్ డైరెక్టర్ తో రవితేజ సినిమా..

Raviteja Trinatharao Nakkina Dhamaka Combo Working Again

Dhamaka

Raviteja : రవితేజ ఒక హిట్ కొడితే మూడు నాలుగు ఫ్లాప్స్ చూస్తున్నాడు. 2022 లో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ – శ్రీలీల జంటగా తెరకెక్కిన ధమాకా సినిమాతో రవితేజ హిట్ కొట్టాడు. ఆ సినిమా 100 కోట్లు వసూలు చేసి రవితేజ కెరీర్లోనే మొదటి 100 కోట్ల సినిమా ఇచ్చింది. ఆ తర్వాత రవితేజ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలతో వచ్చినా వీటిల్లో ఏది హిట్ అవ్వలేదు. రిలీజ్ కి ముందు ఈ సినిమాలపై అంచనాలు ఉన్నా రిలీజ్ తర్వాత సినిమాలు ఎవరూ పట్టించుకోలేదు.

దీంతో రవితేజ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. త్వరలో రవితేజ మాస్ జాతర అనే సినిమాతో రానున్నాడు. ఈ సినిమా హిట్ అవుతుందనే సినీ పరిశ్రమలో వినిపిస్తుంది. ఆ తర్వాత ఇంకే సినిమా ఓకే చెయ్యలేదు రవితేజ. అయితే మరోసారి ధమాకా కాంబోని రిపీట్ చేయబోతున్నాడట. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్స్ తో హిట్స్ కొట్టే త్రినాథ రావు నక్కిన రవితేజకు ధమాకా లాంటి పెద్ద హిట్ ఇవ్వడంతో ఇంకో కథ చెప్పగానే రవితేజ ఓకే చేసేసాడు.

త్రినాథరావు నక్కిన.. సందీప్ కిషన్ హీరోగా మజాకా సినిమా తెరకెక్కించాడు. మజాకా ఫిబ్రవరి 26 రిలీజ్ కానుంది. ఈ సినిమాకు హిట్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా అన్ని రైట్స్ సేల్ అయిపోయి ప్రాఫిట్స్ లో ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. ధమాకా తర్వాత ఇంకో సినిమా చేద్దామని రవితేజని నేను అడిగాను.దిల్ రాజు గారు ఒక లైన్ చెప్తే దాన్ని ఓ నాలుగు నెలలు కష్టపడి స్క్రిప్ట్ చేశాను. ఆ కథ దిల్ రాజు గారికి నచ్చింది. రవితేజ గారికి కూడా నేరేషన్ ఇస్తే ఆయన కూడా ఓకే అన్నారు. త్వరలోనే రవితేజ గారితో ఆ సినిమా ఉంటుంది అని అన్నారు.

దీంతో ధమాకా తర్వాత మరోసారి త్రినాథరావు నక్కిన తో రవితేజ సినిమా అంటే ఫుల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని, కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాగే సందీప్ కిషన్ మజాకా సినిమాకు కూడా సీక్వెల్ అనుకున్నామని, కుదిరితే సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించారు త్రినాథరావు.

Also Read : Samantha : ఫోన్ కి దూరంగా ఉన్న సమంత.. ఆ హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ నచ్చాయట..