Tiger Nageswara Rao : రవితేజ ఊర మాస్.. టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ రిలీజ్..

తాజాగా నేడు టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఫస్ట్ లుక్ లాంచ్ ని రాజమండ్రి గోదావరి నది మీద ఉన్న రైల్వే బ్రిడ్జ్ పై చేయడం విశేషం.

Published By: HashtagU Telugu Desk
Raviteja Tiger Nageswara Rao Movie First Look and Glimpse Released

Raviteja Tiger Nageswara Rao Movie First Look and Glimpse Released

మాస్ మహారాజ రవితేజ(Raviteja) ఇటీవల వరుస సినిమాలు చేస్తున్నారు. గత సినిమా రావణాసుర(Ravanasura) ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao)తో రాబోతున్నాడు రవితేజ. స్టువర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా 1970ల కథతో తెరకెక్కుతున్నట్టు సమాచారం. పూర్తిగా రా అండ్ రస్టిక్ సినిమాగా తెరకెక్కుతోంది.

తాజాగా నేడు టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఫస్ట్ లుక్ లాంచ్ ని రాజమండ్రి గోదావరి నది మీద ఉన్న రైల్వే బ్రిడ్జ్ పై చేయడం విశేషం. బ్రిడ్జ్ మీద నుంచి ఫస్ట్ లుక్ ఉన్న బ్యానర్ ని కిందకి వదిలారు. అనంతరం గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ కి అయిదు భాషల్లో అయిదుగురు స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం.

తెలుగులో వెంకటేష్, హిందీలో జాన్ అబ్రహం, తమిళ్ లో కార్తీ, కన్నడలో శివరాజ్ కుమార్, మలయాళంలో దుల్కర్ సల్మాన్ టైగర్ నాగేశ్వర రావు గ్లింప్స్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ గ్లింప్స్ లో.. అది 70వ దశకం. బంగాళాఖాతంలో తీరప్రాంతంలో ఓ చిన్న గ్రామం. ప్రపంచాన్ని భయపెట్టే చీకటి కూడా అక్కడి జనాల్ని చూసి భయపడుతుంది. దడ దడ మంటూ వెళ్లే రైలు ఆ ప్రాంతం పొలిమేర రాగానే గజగజ వణుకుతుంది. ఆ ఊరి మైలురాయి కనపడితే జనం అడుగు ముందుకు వేయరు. దక్షిణ భారతదేశ నేర రాజధాని స్టువర్టుపురం. ఆ ప్రాంతానికి ఇంకో పేరు కూడా ఉంది టైగర్ జోన్.. అని చాలా గంభీరంగా వాయిస్ ఓవర్ చెప్పించారు. ఇక చివర్లో రవితేజ.. జింకని వేటాడే పులిని చూసి ఉంటావు, పులిని వేటాడే పులిని చూశావా? అని పవర్ ఫుల్ గా చెప్పారు.

దీంతో టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్, గ్లింప్స్ వైరల్ గా మారాయి. ఈ సినిమాతో రవితేజ భారీ హిట్ కొట్టడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడని అర్ధమవుతుంది. ఇక టైగర్ నాగేశ్వర రావు సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20 న రిలీజ్ కాబోతుంది.

 

Also Read :  Bichagadu 2 : తిరుపతిలో బిచ్చగాళ్లతో బిచ్చగాడు 2.. బిచ్చగాళ్లకు చెన్నైలో స్పెషల్ షో..

  Last Updated: 24 May 2023, 08:19 PM IST