Site icon HashtagU Telugu

Raviteja : జై సినిమా.. ఇది మాస్ రాజా అంటే..!

Raviteja Super Speech At Tiger Nageswara Rao Pre Release Event

Raviteja Super Speech At Tiger Nageswara Rao Pre Release Event

Raviteja మాస్ మహరాజ్ రవితేజ అంటేనే ఎనర్జీకి కేరాఫ్ అడ్రెస్ అని తెలిసిందే. చిరంజీవి తర్వాత నేటి యువ హీరోలకు స్పూర్తిగా నిలుస్తూ కష్టపడితే ఏదో ఒకరోజు నువ్వు సక్సెస్ సాధిస్తావు అన్న నమ్మకాన్ని ఇచ్చారు రవితేజ. కెరీర్ మొదట్లో చిన్న చిన్న వేషాలతో మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ గా ఆయన ప్రస్థానం అందరికీ తెలిసిందే. రవితేజ లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు సినిమా ఈ నెల 20న రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగింది. ఈవెంట్ కి గెస్ట్ గా విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) అటెండ్ అయ్యారు. రవితేజ ఎనర్జిటిక్ స్పీచ్ మాస్ రాజా ఫ్యాన్స్ ని అలరించింది. సినిమా గురించి సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ గురించి మాట్లాడిన రవితేజ అందరు తమ బెస్ట్ ఇచ్చారని అన్నారు. ఇక డైరెక్టర్ వంశీ ఇంత బాగా సినిమా తీస్తాడని తాను ఊహించలేదని అన్నారు. సినిమా కథ విన్నప్పటి నుంచి సినిమా గురించి ఎగ్జైట్ అవుతూనే ఉన్నానని అన్నారు.

ఈ సినిమా మిమ్మల్ని గట్టిగా అలరిస్తుందని నమ్మకంతో చెప్పారు రవితేజ. తన సినిమాతో పాటు బాలయ్య భగవంత్ కేసరి, విజయ్ లియో సినిమాలు కూడా బాగా ఆడాలని అన్నారు. చివర్లో జై సినిమా అంటూ అదరగొట్టారు రవితేజ. సినిమాను ప్రేమించి తనకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చిన సినిమా గురించి రవితేజ (Raviteja) ఎప్పుడు గొప్పగా చెబుతుంటారు. అందుకు నిదర్శనమే ఆయన జై సినిమా అని చెప్పడం.

టైగర్ నాగేశ్వర రావు సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. స్టూవర్టుపురం దొంగ నాగేశ్వర రావు కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ టైగర్ నాగేశ్వర రావు సినిమా కేవలం తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో భారీగా రిలీజ్ అవుతుంది.

Also Read : Hyderabad: హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం