Raviteja : పీరియాడిక్ స్టోరీతో రవితేజ, శ్రీలీల కాంబో మూవీ.. అటవీ బ్యాక్‌డ్రాప్‌తో..

పీరియాడిక్ స్టోరీతో రవితేజ, శ్రీలీల కాంబో మూవీ ఉండబోతుందట. అటవీ బ్యాక్‌డ్రాప్‌తో..

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 11:16 AM IST

Raviteja : ‘ధమాకా’ సినిమాతో సూపర్ హిట్టుని అందుకున్న రవితేజ, శ్రీలీల.. మరోసారి కలిసి నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసారు. ‘సామజవరగమన’ సినిమాతో రచయితగా మంచి గుర్తింపుని సంపాదించుకున్న భాను బొగ్గవరపు.. దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమాని తెరకెక్కించినబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టుకోబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని జరుపుకుంటుంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా కథ అరకు ప్రాంతంలోని అడవి నేపథ్యంతో సాగనుందట. పీరియాడిక్ కథతో ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. ‘సామజవరగమన’ వంటి కామెడీ ఎంటర్టైనర్ తో ఆకట్టుకున్న భాను.. మరి ఇప్పుడు ఈ పీరియాడిక్ కథతో ఎలా మెప్పిస్తారో చూడాలి. కాగా రవితేజ, శ్రీలీల ‘ధమాకా’ మూవీతో వంద కోట్ల మార్క్ ని అందుకున్నారు.

దీంతో ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. వాటికీ తగ్గట్లు నిర్మాత నాగవంశీ కూడా భారీగా ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ కాంబో బాక్స్ ఆఫీస్ వద్ద అదే ధమాకాని చూపిస్తుందా అనేది చూడాలి. కాగా రవితేజ ప్రస్తుతం ‘మిస్టర్ బచ్చన్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హరీష్ శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ మూవీకి రీమేక్ గా వస్తుంది. అజయ్ దేవగన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘రైడ్’కి ఇది రీమేక్ గా వస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత రవితేజ, శ్రీలీల సినిమా మొదలు కానుంది.