Site icon HashtagU Telugu

Lip Lock Scenes: ము..ము.. ముద్దంటే చేదా.. శ్రీలీలకు ‘నో’ చెప్పిన రవితేజ!

Ravi Teja kissing scenes

Ravi Teja

ఇటీవలి కాలంలో మాస్ హీరో రవితేజ (Raviteja) తన హీరోయిన్లను ముద్దు (Kissing) పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. డింపుల్ హయాతి అయినా, ఖిలాడీలో మీనాక్షి చౌదరి అయినా, లేదా రామారావు ఆన్ డ్యూటీలో దివ్యాంశ కౌశిక్ అయినా ముద్దు (Kissing) పెట్టుకోవడం చూడొచ్చు. స్టార్ హీరో తన వయసులో సగం ఉన్న హీరోయిన్స్ తో లిప్ లాక్ హాట్ టాపిక్ గా మారింది. రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. ఇందులో 54 ఏళ్ల రవితేజ, 21 ఏళ్ల యువ సంచలనం శ్రీలీల (Sreeleela) తో రొమాన్స్ చేస్తున్నాడు.

ఈ యంగ్ బ్యూటీతో కూడా సీనియర్ హీరో లిప్ లాక్ చేసి ఉంటాడని చాలా మంది అంచనా వేస్తున్నారు. అయితే, రెండు కారణాల వల్ల రవితేజ (Raviteja) కిస్సింగ్ సీన్స్ వద్దని చెప్పినట్టు టాక్. ఒకటి, లీడ్ పెయిర్ మధ్య వయసు తేడా గురించి పెద్దగా చర్చ జరగడం, రెండవ కారణం గతంలో ముద్దు సన్నివేశాలు చేసిన చిత్రాలన్నీ ఘోరంగా ఫ్లాప్ అవడం. దర్శకుడు నక్కిన త్రినాధ రావు డైరెక్ట చేస్తున్న ఈ మూవీలో రొమాన్స్ సీన్స్ ఉన్నాయట. అయితే రవితేజ (Raviteja) యంగ్ హీరోయిన్స్ కిస్సింగ్ కి సీన్స్ కు బ్రేక్ ఇచ్చాడా లేదా అనేది డిసెంబర్ 23న సినిమా రిలీజ్ అయ్యేసరికి తేలిపోతోంది.

Also Read: Katrina Kaif Looks: కవ్విస్తున్నా కత్రినా.. స్టన్నింగ్ లుక్స్ లో కేక!