మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాడు. అదేంటో భారీ అంచనాలతో వచ్చిన రవితేజ సినిమాలు నిరాశ పరచినా ఆయనలో ఏమాత్రం ఎనర్జీ తగ్గదు. దీనితో కాలేదు కాబట్టి నెక్స్ట్ సినిమాతో హిట్ కొడతాం అన్న కసితో పనిచేస్తుంటాడు. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుంచి ఈమధ్యనే ఒక సాంగ్ రిలీజ్ కాగా అది కాస్త హిట్ అయ్యింది.
రవితేజ తన నెక్స్ట్ సినిమా అనుదీప్ తో చేయాల్సి ఉంది కానీ దాని గురించి ఎలాంటి అప్డేట్ రావట్లేదు. ఇదిలాఉంటే రవితేజ (Raviteja) సినిమాతో డైరెక్టర్ గా మారిన కె.ఎస్ బాబీ తన నెక్స్ట్ సినిమా మాస్ రాజాతో చేయాలని అనుకుంటున్నాడట. పవర్ తో రైటర్ గా ఉన్న బాబీని డైరెక్టర్ గా మార్చిన రవితేజ ఆయన కోసమే వాల్తేరు వీరయ్య సినిమా చేశాడు.
ఈ సినిమా షూటింగ్ టైం లోనే మరో సినిమా లైన్ చెప్పడంతో మాస్ రాజా ఓకే అనేశాడట. ఈ సినిమా రవితేజ ప్రజల కోసం పోరాడే వ్యక్తిగా ఉంటాడట. అందుకే ఈ సినిమాకు టైటిల్ గా ప్రజల మనిషి (Prajala Manishi) అని పెట్టబోతున్నారట. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో బాలకృష్ణ (Balakrishna) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే రవితేజ సినిమా లైన్ లో పెట్టబోతున్నాడు.
రవితేజ తో పవర్ (Power) లాంటి సినిమా తీసిన డైరెక్టర్ బాబీ ఈసారి నెక్స్ట్ లెవెల్ సినిమా కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. రవితేజ మార్క్ మాస్ మూవీగా ఇది రాబోతుంది. మరి ఈ సినిమా గురించి మిగతా డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి. సో రాబోతున్న సినిమాలతో మాస్ రాజా ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం పక్కా అని చెప్పొచ్చు.
Also Read : Venu Swami : బిగ్ బాస్ 8 లో వేణు స్వామి.. భారీ రెమ్యునరేషన్..?