Raviteja Mr Bacchan Teaser మాస్ మహరాజ్ రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ కి మంచి బజ్ వచ్చింది. ఇక లేటెస్ట్ గా సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
మిస్టర్ బచ్చన్ సినిమా టీజర్ చూశాక రవితేజకు పర్ఫెక్ట్ కంబ్యాక్ అనిపించేలా ఉంది. ధమాకా సక్సెస్ తర్వాత రవితేజ వరుస సినిమాలైతే చేశాడు కానీ సక్సెస్ పడలేదు. ఐతే మాస్ రాజా ఫ్యాన్స్ ఆకలి తీర్చేందుకు హరీష్ శంకర్ ఈ సినిమా తెరకెక్కించాడు. రవితేజని పర్ఫెక్ట్ గా వాడుకున్నట్టు టీజర్ చూస్తేనే అనిపిస్తుంది.
Also Read : Mahesh Babu : మహేష్ ఇక మీద గోల్డ్ స్టార్..?
మిస్టర్ బచ్చన్ సినిమా బాలీవుడ్ (Bollywood) సూపర్ హిట్ సినిమా రైడ్ కు రీమేక్ గా వస్తుంది. ఐతే సినిమా రీమేక్ అనే మాటే కానీ ఎక్కడ అలా కనిపించలేదు. హరీష్ శంకర్ (Harish Shankar) మరోసారి తన మాస్ టేకింగ్ తో అదరగొట్టాడని అనిపిస్తుంది. రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా మిస్టర్ బచ్చన్ రాబోతుంది.
సినిమా టీజర్ తోనే దాని మీటర్ ఎంత అన్నది తెలుస్తుంది. మిస్టర్ బచ్చన్ టీజర్ చూస్తే ఇది పక్కా హిట్టు సినిమా అనే వైబ్ వచ్చింది. రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా మిస్టర్ బచ్చన్ వస్తుంది. ఆగష్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి థియేటర్ లో మాస్ ఆడియన్స్ ని మిస్టర్ బచ్చన్ ఎలా అలరిస్తాడో చూడాలి.
Also Read : Tollywood : ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా డిస్టిబ్యూటర్ భరత్ భూషణ్ గెలుపు