Site icon HashtagU Telugu

Raviteja : దేవర ముంగిట నేనుంటా అంటున్న మాస్ రాజా..?

Interesting Title for Raviteja 75th Movie

Interesting Title for Raviteja 75th Movie

Raviteja యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భారీ సినిమా దేవర. యువసుధ ఆర్ట్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను ముందు అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ డేట్ కన్నా ముందే సినిమాను రిలీజ్ లాక్ చేశారు. సెప్టెంబర్ 27న దేవర రిలీజ్ అనౌన్స్ చేశారు. సినిమా ముందుకు వచ్చినందుకు ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఉన్నారు.

ఐతే దేవర వస్తున్నాడని తెలిసినా కూడా సెప్టెంబర్ 27న మాస్ మహరాజ్ రవితేజ మిస్టర్ బచ్చన్ రిలీజ్ డేట్ ప్రకటించారు. దేవర సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకు పోటీగా రిస్క్ తప్పదు. కానీ రవితేజ ఈ విషయంలో తగ్గడం లేదని తెలుస్తుంది. మిరపకాయ్ తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో మిస్టర్ బచ్చన్ వస్తుంది.

బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా రైడ్ కి రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. జూన్ 17న అంటే మండే రోజు సినిమా నుంచి ఒక షో రీల్ రిలీజ్ చేస్తామని హరీష్ శంకర్ చెప్పాడు. మొత్తానికి పోటీలో దేవర ఉన్నా దేవర ముంగిట నేనుంటా అంటూ రవితేజ వస్తున్నాడు. మరి మిస్టర్ బచ్చన్ దేవర ఈ ఫైట్ లో ఎవరు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.