Site icon HashtagU Telugu

Raviteja Mr Bacchan : మిస్టర్ బచ్చన్ ఓటీటీ లోకి వచ్చేస్తుందా..?

Raviteja Mr Bacchan OTT Release Date Locked

Raviteja Mr Bacchan OTT Release Date Locked

మాస్ మహరాజ్ రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో భాగ్య శ్రీ (Bhagya Sri) బోర్స్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు మిక్కే జే మేయర్ మ్యూజిక్ అందించారు. బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ రీమేక్ గా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సినిమా రిలీజ్ ముందు ఒక రేంజ్ లో హడావిడి చేసినా ఆఫ్టర్ రిలీజ్ రిజల్ట్ మాత్రం సంతృప్తి పరచలేదు.

ఈ సినిమాపై డైరెక్టర్ హరీష్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ సినిమాపై ఎంత బజ్ పెంచాయో అంత ఇంపాక్ట్ కూడా కలిగేలా చేశాయి. ఐతే థియేట్రికల్ రన్ లో బొక్క బోర్లా పడ్డ ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. భారీ మొత్తానికే మిస్టర్ బచ్చన్ ఓటీటీ రైట్స్ పొందినట్టు తెలుస్తుంది.

థియేట్రికల్ వెర్షన్ ఎలాగు పోయింది కాబట్టి మిస్టర్ బచ్చన్ ని డిజిటల్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. రవితేజ మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) సినిమా వినాయక చవితికి ఓటీటీ రిలీజ్ లాక్ చేసినట్టు తెలుస్తుంది. మరి థియేట్రికల్ రన్ లో మెప్పించలేని ఈ సినిమా డిజిటల్ రిలీజ్ లో అయినా ఆడియన్స్ ని మెప్పిస్తుందేమో చూడాలి.

మిరపకాయ్ సినిమా తర్వాత రవితేజ (Raviteja) హరీష్ శంకర్ కాంబో ఒక సూపర్ హిట్ అందిస్తుందని అనుకున్న మాస్ రాజా ఫ్యాన్స్ కి ఈ సినిమా రిజల్ట్ షాక్ ఇచ్చింది.

Also Read : Pushpa 2 : పుష్ప పార్ట్ 3 కూడా ఉందట.. టైటిల్ అదేనట..!